Share News

Viral Video: ఈ దొంగ తెలివి మామూలుగా లేదుగా.. తాళం తీయకుండానే లాకప్ నుంచి ఎలా వచ్చేశాడో చూడండి..

ABN , Publish Date - Sep 10 , 2024 | 08:32 PM

దొంగల తెలివితేటలు చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. కొందరు కళ్లెదుటే ఉంటూ చివరకు కళ్లుగప్పి చోరీలకు పాల్పడుతుంటారు. అలాగే అంతే తెలివిగా తప్పించుపోతుంటారు. మరికొందరి తెలివితేటలు చూస్తే పోలీసులు కూడా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇలాంటి ..

Viral Video: ఈ దొంగ తెలివి మామూలుగా లేదుగా.. తాళం తీయకుండానే లాకప్ నుంచి ఎలా వచ్చేశాడో చూడండి..

దొంగల తెలివితేటలు చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. కొందరు కళ్లెదుటే ఉంటూ చివరకు కళ్లుగప్పి చోరీలకు పాల్పడుతుంటారు. అలాగే అంతే తెలివిగా తప్పించుపోతుంటారు. మరికొందరి తెలివితేటలు చూస్తే పోలీసులు కూడా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇలాంటి విచిత్రమైన దొంగల వీడియోలు సోషల్ మీడియాలో రోజూ చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో దొంగ తెలివితేటలు చూసి పోలీసులు ఖంగుతిన్నారు. తాళం తీయకుండానే జైల్లోని లాకప్‌ నుంచి అతను బయటికి రావడం చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఈ దొంగ తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తు్న్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video)( తెగ వైరల్ అవుతోంది. ఓ దొంగ (thief) లాకప్ నుంచి తాళం తీయకుండానే బయటికి రావడం చూసి పోలీసులు షాక్ అయ్యారు. తర్వాత అతడి తెలివితేటలు పరీక్షించాలనే ఉద్దేశంతో పోలీసులందరి సమక్షంలో అతడితో అదే విన్యాసం చేయించారు. తాళం వేసి ఉన్న లాకప్‌లో (Jail Lockup) అతన్ని ఉంచారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే అంతా అవాక్కయ్యే ఘటన చోటు చేసుకుంది.

Viral Video: వావ్.. టైరుకు గాలి నింపే కొత్త టెక్నిక్.. మరీ ఎంత సింపుల్‌గా చేశాడంటే..


వేసిన తాళం వేసినట్లుగానే ఉన్నా.. అతను మాత్రం బయటికి వచ్చేశాడు. లోపల ఉన్న యువకుడు ఇనుప మధ్యలో ముందుగా తన తలను దూర్చాడు. తల బయటికి పెట్టిన తర్వాత కొంచెం ఏటవాలుగా మారి చివరకు తన శరీరాన్ని మొత్తం ఇనుప ఊచల మధ్యలో నుంచి ఇవతలి వైపునకు తెచ్చాడు. ఇలా ఎంతో సింపుల్‌గా జైలు గది లోపలి నుంచి బయటికి వచ్చేశాడు. ఇతడి అతి తెలివితేటలు చూసి అక్కడున్న పోలీసులంతా అవాక్కయ్యారు.

Viral Video: తన మానాన తాను బండి తోసుకుంటూ వస్తుండగా.. మధ్యలో తోపుడు బండి ఎంత పని చేసిందో చూడండి..


కొన్ని నెలల కిందట చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ దొంగ తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇకపై వాటికి ఊచలను మరిన్ని పెంచాలేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: మొసలి ఆహారాన్ని లాక్కెళ్లిన డేగ.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. అవాక్కవుతారు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 10 , 2024 | 08:32 PM