Share News

Viral Video: కదులుతున్న కారులో ఇదేం పాడుపని.. ఓవైపు డ్రైవ్ చేస్తూనే..

ABN , Publish Date - Jul 18 , 2024 | 03:14 PM

మనం కారులో సుదీర్ఘ ప్రయాణానికి బయలుదేరినప్పుడు.. పాటలు వినుకుంటూ జోలీగా వెళ్లడమే సహజమే! ముఖ్యంగా.. యువతీ, యువకులు ఇలా ఎంజాయ్ చేసుకుంటూ కార్లలో షికార్లకు..

Viral Video: కదులుతున్న కారులో ఇదేం పాడుపని.. ఓవైపు డ్రైవ్ చేస్తూనే..
Viral Video

మనం కారులో సుదీర్ఘ ప్రయాణానికి (Long Drives) బయలుదేరినప్పుడు.. పాటలు వినుకుంటూ జోలీగా వెళ్లడమే సహజమే! ముఖ్యంగా.. యువతీ, యువకులు ఇలా ఎంజాయ్ చేసుకుంటూ కార్లలో షికార్లకు వెళ్తుంటారు. అయితే.. డ్రైవర్ సీట్‌లో కూర్చున్న వాళ్లకు ఎంజాయ్ చేయడానికి వీలుండదు. కొంచెం తేడా కొట్టినా.. ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి అలర్ట్‌గా ఉంటారు. కానీ.. కొందరు మాత్రం అజాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. స్టీరింగ్ వదిలేసి మరీ అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. ఓ మహిళ కూడా ఇలాంటి పనే చేసింది. సీటు బెల్టు పెట్టుకోకుండా, స్టీరింగ్ వదిలేసి.. స్టెప్పులేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వగా.. పోలీసులు రంగంలోకి దిగారు.


రిపోర్ట్స్ ప్రకారం.. మహీంద్రా థార్ ఎస్‌యూవీ కారులో ఒక స్నేహితుల బృందం ఘాజియాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ఈ కారుని ఒక మహిళ నడుతుపుండగా.. పక్కనే ఆమె స్నేహితురాలు కూర్చొని ఉంది. అయితే.. వీళ్లిద్దరు సీటు బెల్టు పెట్టుకోలేదు. పైగా.. ఓ పాటకు వీళ్లు సీట్లో కూర్చొనే స్టెప్పులు వేశారు. పక్క సీట్లో ఉన్న మహిళ సంగతి పక్కనపెడితే.. డ్రైవింగ్ సీట్లో ఉన్న మహిళ సైతం స్టీరింగ్ వదిలేసి మరీ డ్యాన్స్ చేసింది. తాను కారు నడుపుతున్నానన్న సంగతి మర్చిపోయి.. తన స్నేహితురాలితో కలిసి చిందులేయడంలో బిజీ అయిపోయింది. ఈ మొత్తం తతంగాన్ని వెనుక సీట్లో కూర్చొన్న మరొకరు రికార్డు చేసి, ఏదో ఘనకార్యం చేసినట్లు నెట్టింట్లో (రీల్) పోస్టు చేశారు. దీంతో.. ఈ వీడియోపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిపడుతున్నాయి. ముఖ్యంగా.. డ్రైవింగ్ సీట్లో ఉన్న మహిళ నెటిజన్ల చేతిలో అప్రతిష్ట మూటగట్టుకుంది.


నిశాంత్ శర్మ అనే ఓ ఎక్స్ యూజర్ ఈ వీడియోని షేర్ చేస్తూ.. ‘‘వీళ్లు చావడమే కాకుండా ఇతరుల్ని కూడా చంపేస్తారు. కదులుతున్న కారులో ఇలాంటి చేష్టలకు పాల్పడటం వల్లే రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఎన్‌హెచ్9 రహదారిలో ఘాజియాబాద్ నుంచి ఢిల్లీకి ఈ కారు వెళ్లింది. చక్కగా కారు నడపకుండా.. ఛమ్మక్ ఛల్లో పాటకు స్టెప్పులేస్తూ ఈ రీల్ చేశారు. వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి’’ అంటూ రాసుకొచ్చాడు. ఈ విషయం ఉత్తరప్రదేశ్ పోలీసుల దృష్టికి చేరింది. దీంతో.. ఈ విషయాన్ని పరిశీలించి, తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా వాళ్లు ఘాజియాబాద్ పోలీసులను సూచించారు. మరోవైపు.. నెటిజన్లు ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల వల్లే రోజురోజుకి ప్రమాదాలు పెరుగుతున్నాయని నిప్పులు చెరుగుతున్నారు.

Read Latest Viral News and Telugu News

Updated Date - Jul 18 , 2024 | 03:14 PM