Share News

Viral Video: అది లారీ అనుకున్నావా.. లేక జిమ్ సెంటర్ అనుకున్నావా.. ఇతడు చేస్తున్న పని చూస్తే..

ABN , Publish Date - Sep 26 , 2024 | 08:37 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో మన చుట్టూ జరిగే వింతలూ, విశేషాలన్నీ ఆ మరుక్షణమే వీడియోల రూపంలో నెట్టింట్లోకి వచ్చి చేరుతుంటాయి. వాటిలో విచిత్రంగా అనిపించే వీడియోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంటాయి. తద్వారా ఎంతో మంది..

Viral Video: అది లారీ అనుకున్నావా.. లేక జిమ్ సెంటర్ అనుకున్నావా.. ఇతడు చేస్తున్న పని చూస్తే..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో మన చుట్టూ జరిగే వింతలూ, విశేషాలన్నీ ఆ మరుక్షణమే వీడియోల రూపంలో నెట్టింట్లోకి వచ్చి చేరుతుంటాయి. వాటిలో విచిత్రంగా అనిపించే వీడియోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంటాయి. తద్వారా ఎంతో మంది రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతున్నారు. ఇలాంటి వీడియోలు నిత్యం దర్శనమిస్తూనే ఉంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు రన్నింగ్ లారీపై చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ లారీ రన్నింగ్‌లో (Running lorry) ఉండగా.. అందులో ఉన్న యువకుడు (young man) విచిత్రంగా ప్రవర్తించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. జిమ్‌కు వెళ్లే అవకాశం లేక.. ఎలాగైనా వ్యాయామం (exercise) చేయాలని అనుకున్నాడో ఏమో గానీ.. చివరకు లారీనే జిమ్ సెంటర్‌గా మార్చేశాడు.

Viral Video: ఈమె తెలివి మామూలుగా లేదుగా.. ప్రెషర్ కుక్కర్‌పై ఆయిల్ పోసి.. ఆ సమస్యకు చెక్ పెట్టిందిగా..


లారీ రన్నింగ్‌లో ఉండగా వెనుక వైపు కింద బంపర్ మధ్యలో కాళ్లు పెట్టి పడుకున్నాడు. లారీ వేగంగా వెళ్తున్న సమయంలో చేతులు మెడ కింద పెట్టి పైకి, కిందకు శరీరాన్ని కదిలిస్తూ వ్యాయామం చేస్తున్నాడు. కాళ్ల సాయంతో కిందపడకకుండా గట్టిగా పట్టుకుని ఈ ఫీట్ చేశాడు. ఇలా చాలా దూరం వరకూ అతను ఇలాగే చేస్తూ వెళ్లాడు. లారీ వెనుక కారులో వెళ్తున్న వారు ఈ ఘటనను చూసి షాక్ అయ్యారు. వెంటనే వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Viral Video: వంటగదిలో పనిలో ఉన్న మహిళ.. సడన్‌గా కొండచిలువ ఎంట్రీ.. 2 గంటల తర్వాత లోపలికి వెళ్లి చూడగా..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతను జిమ్ ప్రేమికుడిలా ఉన్నాడే’’.. అంటూ కొందరు, ‘‘ప్రాణాలు పోయినా పర్లేదు.. జిమ్ చేయడం మాత్రం ఆపేదే లేదు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: మద్యం మత్తులో కుక్కకు ముద్దు పెట్టాడు.. చివరికి ఏం జరిగిందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 26 , 2024 | 08:37 PM