Share News

Viral: చనువుగా ఉంటూనే.. కాబోయే భర్త చేసిన నిర్వాకం తెలుసుకుని యువతి షాక్.. చివరకు..

ABN , Publish Date - May 08 , 2024 | 05:53 PM

ప్రేమ పేరుతో కొందరు పెళ్లి పేరుతో మరికొందరు యువతులను మోసం చేయడం చూస్తూ ఉన్నాం. దీనిపై ప్రశ్నించిన వారిపై ఎదురుదాడులు చేస్తున్న ఘటనలు నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా..

Viral: చనువుగా ఉంటూనే.. కాబోయే భర్త చేసిన నిర్వాకం తెలుసుకుని యువతి షాక్.. చివరకు..

ప్రేమ పేరుతో కొందరు పెళ్లి పేరుతో మరికొందరు యువతులను మోసం చేయడం చూస్తూ ఉన్నాం. దీనిపై ప్రశ్నించిన వారిపై ఎదురుదాడులు చేస్తున్న ఘటనలు నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నిశ్చతార్థం అవడంతో కాబోయే భార్యతో చనువుగా ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలో అతడు చేసిన నిర్వాకం తెలుసుకుని యువతి షాక్ అయింది. చివరకు ఏం జరిగిందంటే..


ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) గోరఖ్‌పూర్‌లోని తివారిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ యువతికి న్యూఢిల్లీలోని (New Delhi) సంగం విహార్ ప్రాంతానికి చెందిన మోహ్సన్ అన్సారీతో 2023 మే 10న నిశ్చితార్థం (Engagement) జరిగింది. ఆ రోజు నుంచి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండేవారు. కాబోయే భర్తే కావడంతో యువతి కూడా అతడితో చనువుగా ఉంటూ వచ్చింది. ఇదే సాకుతో అన్సారీ కూడా పదే పదే యువతి ఉంటున్న ప్రాంతానికి వచ్చేవాడు.

Viral video: నడిరోడ్డుపై ఈ యువతి చేసిన పనికి.. పోలీసులు కూడా సిగ్గుతో..


ఈ క్రమంలో ఆమెతో చనువుగా ఉంటూనే అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తించేవాడు. అతను అలా ప్రవర్తిస్తున్నా.. కాబోయే భర్తే కావడంతో యువతి కూడా తిరస్కరించలేదు. దీన్ని అలుసుగా తీసుకున్న యువకుడు.. పదే పదే అమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు కూడా తీసుకున్నాడు. ఇలా కొన్ని నెలల తర్వాత ఆమెకు దూరంగా ఉంటూ వచ్చాడు. పెళ్లి ప్రస్తావన వచ్చినా దాట వేస్తూ వచ్చాడు. దీంతో యువతి కటుంబ సభ్యులకు అనుమానం వచ్చి అన్సారీని గట్టిగా నిలదీశారు.

Viral video: అరెరే..! ఈ సింహానికి ఎంత కష్టమొచ్చింది.. జంతువులన్నీ జాలి పడేలా..


యువతి కుటుంబ సభ్యులు నిలదేసేసరికి.. అతను తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. పెళ్లి చేసుకునేది లేదని. ఎక్కువ మాట్లాడితే.. యువతి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బెదిరించాడు. దీంతో చేసేదేమీలేక చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. యువతిని విచారించిన పోలీసులు.. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న అన్సారీ కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Viral video: మెటల్ డిటెక్టర్ పదే పదే సౌండ్ చేస్తుండడంతో మట్టిలో తవ్వాడు.. చివరకు లోపల చూడగా..

Updated Date - May 08 , 2024 | 05:53 PM