Share News

Viral Video: వావ్.. కేక్ కటింగ్ మామూలుగా లేదుగా.. మొత్తానికి ఏటీఎంలా మార్చేశారుగా...

ABN , Publish Date - Oct 23 , 2024 | 09:33 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి తన పుట్టిన రోజు సందర్భంగా కేక్ కటింగ్‌కు సిద్ధమవుతుంది. కుటుం సభ్యులు, స్నేహితులు.. ఆమె కోసం ఓ ప్రత్యేకమైన కేక్ తెప్పించారు. అంతా సిద్ధం చేయగానే సదరు యువతి కేక్ కట్ చేసేందుకు వస్తుంది. అయితే కేక్ మధ్యలో..

Viral Video: వావ్.. కేక్ కటింగ్ మామూలుగా లేదుగా.. మొత్తానికి ఏటీఎంలా మార్చేశారుగా...

వినూత్న ఆలోచిస్తూ వీడియోలు చేసే వారికి సోషల్ మీడియా మంచి వేదికగా మారుతోంది. దీన్ని ఆసరా చేసుకుని చాలా మంది పేరు ప్రఖ్యాతలతో పాటూ డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు. రోజురోజుకూ వీడియోలు, రీల్స్ చేసే వారి సంఖ్య పెరిగిపోవడంతో ఎలాగైనా అందరిలో తమ ప్రత్యేకత నిరూపించుకునేందుకు చాలా మంది వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు చేసే వింత వింత ప్రయోగాలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి కేక్ కటింగ్ చేయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ‘‘కేక్‌ను ఏంటీఎంలా మార్చేశారుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి తన పుట్టిన రోజు సందర్భంగా కేక్ కటింగ్‌కు సిద్ధమవుతుంది. కుటుం సభ్యులు, స్నేహితులు.. ఆమె కోసం ఓ ప్రత్యేకమైన కేక్ తెప్పించారు. అంతా సిద్ధం చేయగానే సదరు యువతి కేక్ కట్ చేసేందుకు వస్తుంది. అయితే కేక్ మధ్యలో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన గుండ్రటి అద్దా్న్ని పైకి లాగమని చెబుతారు.

Viral Video: నటనలో ఈ చిరుతకు ఆస్కార్ ఇవ్వొచ్చు.. జింకను ఎలా వేటాడిందో చూస్తే.. అవాక్కవుతారు..


దీంతో ఆమె దాన్ని లాగి చూడగా లోపలి నుంచి రూ.500ల కరెన్సీ నోట్లు బయటికి వస్తాయి. కరెన్సీ నోట్లను వరుసగా ప్లాస్టిక్ పేపర్‌లో ప్యాక్ చేసి ఉంటారు. అలా ఒకటి కాదు రెండు కాదు.. చాలా కరెన్సీ నోట్లను చైన్ తరహాలో వరసగా అతికించి ఉంటారు. ఇలా కేక్ మధ్య నుంచి (Currency notes inside the cake) కరెన్సీ నోట్లు రావడం చూసి ఆమె షాక్ అవుతుంది. ఎంతో సంతోషంగా వాటిని అలా లాగుతూనే ఉంటుంది. చివరకు కేక్ మధ్యలో ఉన్న నోట్లన్నింటనీ బయటికి లాగేస్తుంది.

Optical illusion: మీ కంటికి ఇది పెద్ద పరీక్ష.. ఇందులో దాక్కున్న బాతును 15 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


తర్వాత ఆమె పక్కన ఉన్న వారు కరెన్సీ నోట్లను ఆమె మెడలో అలంకరిస్తారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది, దీనిపై నెటజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి కేక్ కటింగ్ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్’’.. అంటూ కొందరు, ‘‘అది కేకా.. లేక ఏటీఎం మిషినా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‌లు, 4.30 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈమె రూటే సపరేటుగా.. ఫ్యాన్‌ను ఎలా శుభ్రం చేస్తుందో చూస్తే.. ఖంగుతింటారు..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈమె రూటే సపరేటుగా.. ఫ్యాన్‌ను ఎలా శుభ్రం చేస్తుందో చూస్తే.. ఖంగుతింటారు..

Viral Video: ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే.. మరోవైపు బ్యాక్ బెంచర్ నిర్వాకం మామూలుగా లేదుగా..

Viral Video: ప్రియుడితో ఉండగా సడన్‌గా తలుపు కొట్టిన తల్లి.. దొరక్కుండా ఉండేందుకు ప్రియుడిని ఏం చేసిందంటే..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 23 , 2024 | 09:33 AM