IND vs AUS: వరల్డ్ కప్ హీరోను వణికించిన హర్షిత్ రాణా.. ఏం బౌలింగ్ భయ్యా
ABN , Publish Date - Nov 22 , 2024 | 03:00 PM
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. తొలి రోజే టీమిండియా ఆలౌట్ అవడంతో కంగారూలదే ఆధిపత్యం అని అంతా అనుకున్నారు. కానీ మెన్ ఇన్ బ్లూ బౌలర్లు చెలరేగడంతో మ్యాచ్ ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంది.
పెర్త్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. తొలి రోజే టీమిండియా ఆలౌట్ అవడంతో కంగారూలదే ఆధిపత్యం అని అంతా అనుకున్నారు. కానీ మెన్ ఇన్ బ్లూ బౌలర్లు చెలరేగడంతో మ్యాచ్ ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంది. తాత్కాలిక సారథి జస్ప్రీత్ బుమ్రాతో పాటు అరంగేట్ర బౌలర్ హర్షిత్ రాణా, సీనియర్ సీమర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరుగుతున్నారు. బుమ్రా, సిరాజ్‌లు అక్కడి కండీషన్స్, పేస్‌కు దొరుకుతున్న సాయంతో విజృంభిస్తున్నారు. అయితే వాళ్లిద్దరూ చెలరేగుతారని ముందే ఊహించినా.. హర్షిత్ ఇంత బాగా బౌలింగ్ చేస్తాడని ఎవరూ అనుకోలేదు. ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌కు అతడు వేసిన ఓ బాల్ అయితే మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
రెప్పపాటులో..
వన్డే వరల్డ్ కప్-2023 హీరో ట్రావిస్ హెడ్‌ను హర్షిత్ రాణా వణికించాడు. నిఖార్సయిన పేస్, పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌తో అతడ్ని భయపెట్టాడు. 12వ ఓవర్ వేసేందుకు వచ్చిన హర్షిత్.. హెడ్‌కు మైండ్ బ్లాంక్ డెలివరీ వేశాడు. ఫుల్ లెంగ్త్‌తో ఆఫ్ స్టంప్‌ను టార్గెట్ చేసి అతడు వేసిన బాల్ పడి లోపలికి స్కిడ్ అయింది. అయితే బంతి అంత వేగంగా దూసుకొస్తుందని హెడ్ అంచనా వేయలేకపోయాడు. బంతి అనూహ్యమైన వేగంతో వచ్చి స్కిడ్ అవడంతో అతడు డిఫెన్స్ చేసేందుకు ప్రయత్నించినా అప్పటికే బ్యాట్ ఎడ్జ్‌ను దాటేసి వెళ్లిపోయింది. హెడ్ డిఫెన్స్‌ను దాటి స్టంప్స్‌ను ముద్దాడింది బంతి.
బిత్తరపోయిన హెడ్
రెప్పపాటులో బాల్ తన బ్యాట్‌ను దాటి వికెట్లును పడగొట్టడంతో హెడ్ నమ్మలేకపోయాడు. ఏం జరుగుతోందో అర్థం కాక బిత్తరపోయాడు. అంతే కెరీర్లో తొలి వికెట్ తీసిన హర్షిత్ సంబురాల్లో మునిగిపోయాడు. గాల్లో పంచులు విసురుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. కెప్టెన్ బుమ్రా, కోహ్లీ సహా అందరూ వచ్చి అతడ్ని మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 47 పరుగులతో ఉంది. భారత స్కోరుకు ఆ జట్టు ఇంకా 103 పరుగుల దూరంలో ఉంది. టీమిండియా పేసర్ల దూకుడు చూస్తుంటే కంగారూలను వందలోపే చుట్టేసేలా ఉన్నారు.
Also Read:
జూ. సెహ్వాగ్ ‘డబుల్’
టైటాన్స్ హ్యాట్రిక్
మనోళ్లే చాంపియన్లు
For More Sports And Telugu News