Rishabh Pant: రిషభ్ పంత్‌కి ప్రమోషన్.. టీమిండియా కెప్టెన్‌గా..?
ABN , Publish Date - Apr 20 , 2024 | 10:12 AM
భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు ప్రమోషన్ వచ్చిందా? అతనికి భారత జట్టు పగ్గాలు దక్కనున్నాయా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. జింబాబ్వేతో జరగబోయే టీ20 సిరీస్‌కి ఎంపిక చేయబోయే జట్టుకి.. పంత్‌నే కెప్టెన్‌గా నియమించాలని భావిస్తున్నారట.
భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు (Rishabh Pant) ప్రమోషన్ వచ్చిందా? అతనికి భారత జట్టు పగ్గాలు దక్కనున్నాయా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. జింబాబ్వేతో జరగబోయే టీ20 సిరీస్‌కి ఎంపిక చేయబోయే జట్టుకి.. పంత్‌నే కెప్టెన్‌గా నియమించాలని భావిస్తున్నారట. ఐపీఎల్-2024లో (IPL 2024) కెప్టెన్‌గా, ప్లేయర్‌గా అద్భుత ప్రదర్శన కనబరుస్తుండటంతో.. అతడికే నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని సెలక్షన్ టీమ్ యోచిస్తోందని సమాచారం.
అవన్నీ పచ్చి అబద్ధాలు అంటూ క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ
ఈ ఏడాది జూన్‌లో అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) ముగిసిన తర్వాత భారత జట్టు జింబాబ్వే (Zimbabwe) పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌లో భాగంగా.. ఇరు జట్లు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనున్నారు. ఈ సిరీస్ జూలై 6వ తేదీన ప్రారంభమై, 14వ తేదీన ముగియనుంది. అయితే.. ఈ పర్యటనకు భారత తృతీయ శ్రేణి జట్టును పంపించాలని బీసీసీఐ (BCCI) ఆలోచిస్తోందట. టీ20 వరల్డ్‌కప్‌లో భాగమయ్యే ఒకరిద్దరూ మినహా.. మిగతా భారత ఆటగాళ్లకి ఈ సిరీస్‌కి విశ్రాంతి ఇవ్వనున్నారట. అలాగే.. కొందరిని పరిశీలించిన తర్వాత ఈ జట్టుకి కెప్టెన్‌గా పంత్‌ని నియమించాలని అజిత్ అగార్కర్ (Ajit Agarkar) నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ యోచిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.
హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఆ తప్పు కారణంగా..
తనకు యాక్సిడెంట్ అవ్వడంతో ఏడాదిన్నర పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న పంత్.. ఈ ఐపీఎల్ సీజన్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో కాస్త తడబడ్డాడు కానీ, ఆ తర్వాతి నుంచి చెలరేగడం మొదలుపెట్టాడు. కెప్టెన్‌గా జట్టుని సమర్థవంతంగా నడిపించడమే కాదు.. వికెట్ల వెనకాల కీపర్‌గా, బ్యాటర్‌గా దుమ్ముదులిపేస్తున్నాడు. గతంలోనే నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించాడు కాబట్టి, జింబాబ్వే టూర్‌కి ఎంపిక చేసే జట్టుకి పంత్‌నే కెప్టెన్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే.. రియాన్ పరాగ్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, సాయిసుదర్శన్, అభిషేక్ శర్మ, రుతురాజ్, సంజూ శాంసన్, శివమ్ దూబే, వంటి స్టార్ ఆటగాళ్లను సైతం ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి