Share News

IND vs ZIM T20Is: భారత్, జింబాంబ్వే T20I సిరీస్ షెడ్యూల్, జట్టు వివరాలు ఇవే

ABN , Publish Date - Jul 05 , 2024 | 04:21 PM

T20 ప్రపంచ కప్ 2024 కిరీటాన్ని కైవసం చేసుకోవడంతో భారత జట్టు T20I ఫార్మాట్‌లో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా T20I నుంచి రిటైర్ అయ్యాక, భారత్ ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో జింబాబ్వేతో తన మొదటి అసైన్‌మెంట్‌ను ప్రారంభించనుంది.

IND vs ZIM T20Is: భారత్, జింబాంబ్వే T20I సిరీస్ షెడ్యూల్, జట్టు వివరాలు ఇవే

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2024 కిరీటాన్ని కైవసం చేసుకున్న తర్వాత భారత జట్టు కొత్త టీ20 సిరీస్ ఆడేందుకు సిద్దమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్‌ నుంచి రిటైర్ అయ్యాక తొలిసారి జింబాబ్వే, భారత్ జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరగనుంది.

జింబాబ్వేతో జరగనున్న ఈ సిరీస్‌లో భారత్ జట్టుకు శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహించబోతున్నాడు. నిజానికి రోహిత్, విరాట్ లేని సమయంలో కూడా టీ20 ఫార్మాట్ మ్యాచ్‌లు ఆడడం యువ భారత్ జట్టుకు అలవాటయింది. 2022 టీ20 ప్రపంచ కప్ తర్వాత ఆ ఇద్దరు దిగ్గజాలు ఆఫ్ఘనిస్తాన్ సిరీస్, ఆ తర్వాత నేరుగా టీ20 ప్రపంచ కప్ 2024 మాత్రమే ఆడారు. మిగతా అన్ని సిరీస్‌లలోనూ యువ క్రికెటర్లే ప్రాతినిధ్యం వహించారు. సీనియర్ల లోటు తెలియకుండా ఆడగలిగే యువ క్రికెటర్లు ఉందని పలు సిరీస్‌ల ద్వారా స్పష్టమైంది.

ఇండియా వర్సెస్ జింబాబ్వే షెడ్యూల్

జలై 6 నుంచి హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ మొదలవుతుంది. ఫస్ట్ మ్యాచ్ జులై 6న, జులై 7న రెండో మ్యాచ్, జులై 10న మూడో మ్యాచ్ జరగనుండగా.. చివరి రెండు టీ20లు వరుసగా జులై 13, 14 తేదీల్లో జరగనున్నాయి.


  • భారత్ vs జింబాబ్వే 1వ మ్యాచ్– శనివారం, జులై 6

  • భారత్ vs జింబాబ్వే 2వ మ్యాచ్ – ఆదివారం, జులై 7

  • భారత్ vs జింబాబ్వే 3వ మ్యాచ్ – బుధవారం, జులై10

  • భారత్ vs జింబాబ్వే 4వ మ్యాచ్ – శనివారం, జులై13

  • భారత్ vs జింబాబ్వే 5వ మ్యాచ్ – ఆదివారం, జులై14

ఇరు జట్లు ఇలా..

భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్ (మొదటి రెండు టీ20లకు లేడు), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్డ) (మొదటి రెండు టీ20లకు లేడు), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే ( మొదటి రెండు టీ20లకు లేడు), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేశ్ కుమార్, తుషార్ దేశ్‌పాండే.


ఇక మొదటి రెండు టీ20 మ్యాచ్‌లకు సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణా అందుబాటులో ఉంటారు.

జింబాబ్వే జట్టు: సికందర్ రజా (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, జోనాథన్ క్యాంప్‌బెల్, టెండై చటారా, ల్యూక్ జోంగ్వే, ఇన్నోసెంట్ కైయా, క్లైవ్ మదాండే, వెస్లీ మధేవెరే, తడివానాషే మారుమని, వెల్లింగ్టన్ మసకద్జా, బ్రాండన్ డి మౌజరాబ్, బ్రాండన్ మౌజరాబ్, బ్రాండన్ మౌజరాబ్, రిచర్డ్ నగరవ, మిల్టన్ శుంబా.

కాగా ఈ సిరీస్ ప్రసార హక్కులను సోనీ స్పోర్ట్స్ సొంతం చేసుకుంది.

For Latest News and National News click here

Updated Date - Jul 05 , 2024 | 06:14 PM