IPL 2024: నేడు DC vs GT మ్యాచ్.. గెలవకుంటే ప్లేఆఫ్ రేసు నుంచి
ABN , Publish Date - Apr 24 , 2024 | 08:45 AM
ఐపీఎల్ IPL 2024(IPL 2024)లో నేడు 40వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) మధ్య ఢిల్లీ(Delhi)లోని అరుణ్ జైట్లీ స్టేడియం(Arun Jaitley Stadium)లో జరగనుంది. పాయింట్ల పట్టికలో ఇరు జట్లు దిగువన కొనసాగుతున్నాయి. ఈ విషయంలో వీరిద్దరూ ఈ మ్యాచ్‌లో గెలుపొందడం చాలా ముఖ్యమని చెప్పవచ్చు.
ఐపీఎల్ IPL 2024(IPL 2024)లో నేడు 40వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) మధ్య ఢిల్లీ(Delhi)లోని అరుణ్ జైట్లీ స్టేడియం(Arun Jaitley Stadium)లో జరగనుంది. పాయింట్ల పట్టికలో ఇరు జట్లు దిగువన కొనసాగుతున్నాయి. ఈ విషయంలో వీరిద్దరూ ఈ మ్యాచ్‌లో గెలుపొందడం చాలా ముఖ్యమని చెప్పవచ్చు. ఇదే సీజన్‌లో ఆడిన చివరి మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు గుజరాత్‌ను వారి సొంత మైదానంలో ఓడించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ సొంత మైదానంలో వారిని ఓడించి ప్రతీకారం తీర్చుకోవడానికి శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ జట్టు భావిస్తోంది.
నిజానికి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం(Arun Jaitley Stadium) పిచ్ బ్యాట్స్‌మెన్లకు అనుకూలంగా ఉంటుంది. చిన్న ఫీల్డ్ కారణంగా బౌండరీ లైన్ దాటడం చాలా సులువు. దీంతోపాటు ఇది స్పిన్నర్లకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడగా, ఆతిథ్య జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కానీ ఈసారి మాత్రం ఢిల్లీ కాస్త భిన్నంగా కనిపిస్తోంది.
ఢిల్లీ గుజరాత్ జట్ల మధ్య నేడు జరగనున్న మ్యాచ్‌లో భారీ స్కోర్‌ను చూడవచ్చని క్రీడా వర్గాలు అంటున్నాయి. అరుణ్ జైట్లీ స్టేడియం మొత్తం 86 ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 39 మ్యాచ్‌లు గెలిచింది. రెండోసారి బ్యాటింగ్(batting) చేసిన జట్టు 46 మ్యాచ్‌లు గెలిచింది. ఒక్క మ్యాచ్ ఫలితం లేదు. అటువంటి పరిస్థితుల్లో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
ఇక ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) మధ్య మొత్తం 4 మ్యాచ్‌లు జరిగాయి. అందులో రెండు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు గెలిచాయి. ఢిల్లీపై గుజరాత్ తన అత్యధిక స్కోరు 162 పరుగులు చేయగా, గుజరాత్ టైటాన్స్‌పై ఢిల్లీ తన అత్యధిక స్కోరు 171 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గెలవడం చాలా ముఖ్యం.
ఎందుకంటే ఢిల్లీ జట్టు ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిందే. ప్రస్తుత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఇక ఈ మ్యాచులో గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే ఈ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ జట్టు 53 శాతం గెలిచే అవకాశం ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గెలిచేందుకు 47 శాతం ఛాన్స్ ఉంది.
ఢిల్లీ క్యాపిటల్(Delhi Capitals) ప్రాబబుల్ ప్లేయింగ్ 11లో పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, రిషబ్ పంత్ (C & WK), ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, ఇంపాక్ట్ ప్లేయర్ సుమిత్ కుమార్ కలరు.
గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టు ప్రాబబుల్ ప్లేయింగ్ 11లో వృద్ధిమాన్ సాహా (WK), శుభమాన్ గిల్ (C), కేన్ విలియమ్సన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, సందీప్ వారియర్, మోహిత్ శర్మ, ఇంపాక్ట్ ప్లేయర్ సాయి సుదర్శన్ ఉన్నారు.
ఇది కూడా చదవండి:
CIBIL Score: ఈ తప్పులు చేస్తున్నారా.. మీ సిబిల్ స్కోర్ ఖతం
Read Latest Sports News and Telugu News