Share News

IPL 2024: ఈసారైనా ఆర్సీబీ కల నెరవేరేనా..?

ABN , Publish Date - May 19 , 2024 | 11:21 AM

ఐపీఎల్ 2024 ప్లై ఆప్స్ బెర్త్ కన్ఫామ్ అయ్యాయి. కేకేఆర్, ఆర్ఆర్, ఎస్ఆర్‌హెచ్, ఆర్సీబీ జట్టు ప్లే ఆప్స్ ఆడతాయి. అనూహ్యంగా ప్లే ఆప్ రేసులోకి వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు కప్పుపై కన్నేసింది. గత పదహారు సీజన్లలో ఆర్సీబీ జట్టు కప్పు గెలవలేదు.

IPL 2024: ఈసారైనా ఆర్సీబీ కల నెరవేరేనా..?
RCB

ఐపీఎల్ 2024 ప్లై ఆప్స్ బెర్త్ కన్ఫామ్ అయ్యాయి. కేకేఆర్, ఆర్ఆర్, ఎస్ఆర్‌హెచ్, ఆర్సీబీ జట్టు ప్లే ఆప్స్ ఆడతాయి. అనూహ్యంగా ప్లే ఆప్ రేసులోకి వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు కప్పుపై కన్నేసింది. గత పదహారు సీజన్లలో ఆర్సీబీ జట్టు కప్పు గెలవలేదు. 2009, 2011, 2016లో ఫైనల్ చేరినప్పటికీ ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఈ సారి ఫైనల్ చేరడమే కాదు.. కప్పు కొట్టాలనే కృత నిశ్చయంతో ఆ జట్టు ఉంది.


మార్పు కనిపిస్తోంది..

ఆర్సీబీ జట్టులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో కన్నా టీమ్ మెరుగ్గా ఉంది. ఆటగాళ్లు అందరూ చక్కగా రాణిస్తున్నారు. ఐపీఎల్ 16వ సీజన్‌లో రన్ మెషిన్ విరాట్ కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ చక్కగా రాణించారు. ఈ సారి వారికి ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ జత కలిశాడు. బౌలర్లు కూడా చక్కగా రాణిస్తుండటం కలిసి వచ్చింది.నిజానికి ఈ సీజన్‌లో కూడా ఆర్సీబీ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. ఎందుంటే ఆ జట్టు తొలుత అంతా బాగా ఆడలేదు. ఫస్ట్ 8 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. మరోసారి లీగ్ దశలో ఇంటిముఖం పడుతుందని క్రీడా పండితులు అంచనా వేశారు.


లాస్ట్ ప్లేస్ నుంచి

టేబుల్ పాయింట్లలో లాస్ట్ ప్లేస్‌లో ఉండటం, మైనస్ రన్ రేట్ నమోదవ్వడంతో ఆర్సీబీ ప్లే ఆప్స్‌కు వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆర్సీబీ జట్టుగా ముందుకు నడిచింది. వరసగా ఆరు విజయాలు నమోదు చేసింది. 14 పాయింట్లతో చెన్నై జట్టుతో సమానంగా నిలిచింది. మెరుగైన రన్ రేట్ ఉండటంతో ప్లే ఆప్ చేరింది. ఇక కప్పు కొట్టడమే మిగిలి ఉందని ఆర్సీబీ అభిమానుల ఆశగా ఎదురు చూస్తున్నారు.


మూడుసార్లు ఫైనల్ చేరినప్పటికీ

ఐపీఎల్ సీజన్ మొదలైన మరుసటి ఏడాది (2009) ఆర్సీబీ ఫైనల్ చేరింది. కేవలం ఆరు పరుగుల తేడాతో దెక్కన్ ఛార్జర్స్‌పై ఓటమి చవి చూసింది. 2011లో కూడా ఫైనల్ చేరింది. ఆ సమయంలో సీఎస్కే చేతిలో ఓడిపోయింది. తర్వాత 2016లో ఫైనల్ చేరింది. ఇప్పుడు మరోసారి హైదరాబాద్ జట్టు (ఎస్ఆర్‌హెచ్) చేతిలో ఓడిపోయి ఇంటిముఖం పడింది. ఆ తర్వాత ఆర్సీబీ జట్టు ఫైనల్ వరకు రాలేదు. మహమహులు ఉన్నప్పటికీ టైటిల్ కల కలగానే ఉంది. ఈ సారి టైటిల్ గెలవాలని ఆర్సీబీ అనుకుంటుంది. గత 16 ఏళ్ల నుంచి నెరవేరని కలను సాకారం చేయాలని ఉవ్విళ్లూరుతోంది. చూడాలి మరి ఈ సారైనా కప్పు కొడుతుందో లేదో మరి.


ఈజీ మాత్రం కాదు

ఈ సీజన్‌లో కోల్ కతా, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ జట్లు మంచి ఫామ్‌లో ఉన్నాయి. ఆ జట్లను మట్టి కరిపించి కప్పు గెలవడం అనేది చిన్న విషయం కాదు. లీగ్ దశలో అనూహ్యంగా రాణించిన బెంగళూర్ జట్టు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుందని అభిమానులు గంపెడాశతో ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి.


Read Latest Sports News and Telugu News

Updated Date - May 19 , 2024 | 11:22 AM