Share News

Womens Asia Cup 2024: నేడు మహిళల ఆసియా కప్ సెమీఫైనల్ పోరు.. ఫైనల్స్‌కు ఏ జట్లు వెళ్లే ఛాన్స్ ఉంది

ABN , Publish Date - Jul 26 , 2024 | 09:28 AM

నేడు మహిళల టీ20 ఆసియా కప్ 2024(Women's Asia Cup 2024) సెమీ ఫైనల్ పోరు జరగనుంది. ఈరోజు సెమీస్‌లో నాలుగు జట్లు తలపడనుండగా, వీటిలో రెండు జట్లు ఫైనల్ చేరనున్నాయి. ఈ క్రమంలో భారత్(India Women), బంగ్లాదేశ్(bangladesh) మధ్య మధ్యాహ్నం 2 గంటలకు మొదటి సెమీస్ మ్యాచ్ జరగనుంది. ఇదేరోజు రాత్రి 7 గంటలకు పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ మొదలుకానుంది.

Womens Asia Cup 2024: నేడు మహిళల ఆసియా కప్ సెమీఫైనల్ పోరు.. ఫైనల్స్‌కు ఏ జట్లు వెళ్లే ఛాన్స్ ఉంది
Womens Asia Cup Semifinals

నేడు మహిళల టీ20 ఆసియా కప్ 2024(Women's Asia Cup 2024) సెమీ ఫైనల్ పోరు జరగనుంది. ఈరోజు సెమీస్‌లో నాలుగు జట్లు తలపడనుండగా, వీటిలో రెండు జట్లు ఫైనల్ చేరనున్నాయి. ఈ క్రమంలో భారత్(India Women), బంగ్లాదేశ్(bangladesh) మధ్య మధ్యాహ్నం 2 గంటలకు మొదటి సెమీస్ మ్యాచ్ జరగనుంది. ఇదేరోజు రాత్రి 7 గంటలకు పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ మొదలుకానుంది. భారత మహిళల జట్టు మూడు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థి జట్లపై విజయం సాధించింది. పాకిస్థాన్‌పై ఏడు వికెట్ల తేడాతో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై 78 పరుగులతో, నేపాల్‌పై 82 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ నేతృత్వంలో ఆసియా కప్‌లో సెమీ ఫైనల్, ఫైనల్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.


ఎనిమిదో టైటిల్ కోసం

మరోవైపు ఈ టోర్నమెంట్ బంగ్లాదేశ్(bangladesh) జట్టును అంత తక్కువగా అంచనా వేయలేమని క్రీడా వర్గాలు అంటున్నాయి. ఈ సెమీస్ పోరులో ఎలాగైనా టీమిండియాను ఓడించి ఫైనల్ చేరాలని బంగ్లా జట్టు కూడా భావిస్తోంది. అయితే బంగ్లాదేశ్ 2022లో భారత్‌ను ఫైనల్‌లో ఓడించి మొదటి టైటిల్‌ను గెలుచుకుంది. ఈ క్రమంలో హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టు శుక్రవారం ఈ జట్టుపై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో ఎనిమిదో ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో భారత మహిళా క్రికెట్ జట్టు ఉంది.

T20 ఫార్మాట్‌లో

ఇప్పటికే వన్డే ఫార్మాట్‌లో నాలుగు టైటిళ్లు, టీ20 ఫార్మాట్‌లో మూడు టైటిళ్లు సాధించారు. మహిళల ఆసియా కప్ 2004లో ప్రారంభమైంది. 2008 వరకు ఈ టోర్నమెంట్ ODI ఫార్మాట్‌లో జరిగింది. అదే సమయంలో 2012 నుంచి ఇది T20 ఫార్మాట్‌లో జరుగుతోంది. ఇది తొమ్మిదో ఎడిషన్ కాగా భారత్ ఏడుసార్లు (2004, 2005, 2006, 2008, 2012, 2016, 2022) టైటిల్ గెలుచుకుంది. అయితే ఫైనల్ పోరుకు టీమిండియా వర్సెస్ శ్రీలంక లేదా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్లు వచ్చే అవకాశం ఉందని క్రీడా వర్గాలు అంటున్నాయి.


మహిళల టీమిండియా జట్టులో ఆడనున్న వారిలో హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్, ఉమా ఛెత్రి, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, జెమీమా రోడ్రిగ్స్, రేణుకా ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయాంక సపాటిల్ ఉన్నారు.

బంగ్లాదేశ్ జట్టులో ఆడనున్న వారిలో నిగర్ సుల్తానా (కెప్టెన్), షర్నా అక్తర్, నహిదా అక్తర్, ముర్షిదా ఖాతూన్, షోరీఫా ఖాతూన్, రీతు మోని, రూబియా హైదర్, సుల్తానా ఖాతూన్, జహనారా ఆలం, దిలారా అక్తర్, ఇష్మా తంజీమ్, రబియా ఖాన్, రుమానా అహ్మద్, సబీమీన్ అఖ్తర్, జస్బిమీన్ అక్తర్ కలరు.


ఇవి కూడా చదవండి:


Jasprit Bumrah: రోహిత్ శర్మ-పాండ్యా కెప్టెన్సీ వివాదంపై తొలిసారి స్పందించిన జస్ప్రీత్ బుమ్రా


Google Doodle 2024: వినూత్నంగా గూగుల్ డూడుల్.. దీని అర్థం తెలుసా?


Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 26 , 2024 | 09:37 AM