Share News

గణేష్‌ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Sep 16 , 2024 | 11:02 PM

గణేష్‌ నిమజ్జనోత్సవానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు రామగండం సీపీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. సోమ వారం మంచిర్యాల, లక్షెట్టిపేట పలు ప్రాంతాల్లో నిమజ్జనం, శోభాయాత్ర నిర్వ హించే ప్రదేశాలను పరిశీలించారు.

గణేష్‌ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 16: గణేష్‌ నిమజ్జనోత్సవానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు రామగండం సీపీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. సోమ వారం మంచిర్యాల, లక్షెట్టిపేట పలు ప్రాంతాల్లో నిమజ్జనం, శోభాయాత్ర నిర్వ హించే ప్రదేశాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ నలుగురు ఏసీపీలు, 14 మంది సీఐలు, 19 మంది ఎస్సైలు, 183 ఏఎస్సైలు, 29 మంది మహిళా కానిస్టేబుల్లు, 366 కానిస్టేబుళ్లు, 75 మంది హోంగార్డులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మంచిర్యాల జోన్‌ పరిధిలో 2307 వినాయక విగ్రహా లు ఏర్పాటు చేయగా ఏడు నిమజ్జన కేంద్రాలు ఉన్నాయన్నారు. రాయపట్నం బ్రిడ్జి, గోదావరి పుష్కరఘాట్‌, మంచిర్యాలలో గౌతమేశ్వర మందిరం, సీతా రాంపల్లిలో ఇన్‌టెక్‌ వెల్‌, ఇందారం గోదావరి బ్రిడ్జి, చెన్నూరు పెద్ద చెరువు, బెల్లంపల్లిలో పోచమ్మ చెరువు తదితర ప్రాంతాల్లో నిమజ్జనం చేస్తారని చెప్పారు. ఫ్లడ్‌ లైట్లు, క్రేన్లు, ప్లాట్‌ఫాంలు, మంచినీటి వసతి, నిమజ్జనం జరిగే ప్రాంతంలో గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్‌ సమస్య, నిమజ్జన శోభాయాత్రను డ్రోన్‌ కెమెరా లతో పర్యవేక్షిస్తా మన్నారు. పిల్లలు, మహిళలు శోభా యాత్రలో ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్త పడాలన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు ప్రశాం తంగా నిమజ్జనం జరిగే విధంగా బాధ్యత తీసుకోవాలన్నారు. డీజేలు, బాణా సంచా కాల్చడం నిషేధమ న్నారు. స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ రాఘ వేంద్రరావు, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్‌, లక్షెట్టిపేట, మంచిర్యాల సీఐలు నరేందర్‌, బన్సీలాల్‌, మున్సి పల్‌ కమిషనర్‌ మారుతిప్రసాద్‌, ఉత్సవ సవితి జిల్లా అధ్యక్షుడు దీపేష్‌రేన్వా పాల్గొన్నారు.

దండేపల్లి: గణేష్‌ నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించు కోవాలని సీపీ శ్రీనివాసులు సూచించారు. గూడెం గోదావరి నది వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. సీపీ మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ తో గూడెం గోదావరి నది వద్ద నీటిమట్టం ఎక్కువ ఉందన్నారు. క్రేన్‌ల సాయం తో విగ్రహాలను నిమజ్ఞనం చేసేలా ఏర్పాటు చేశామన్నారు. వంతెన వద్ద ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. గూడెం ఆటవీ చెక్‌పోస్టు నుంచి గోదావరి నది తీరం వరకు విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేయాలన్నారు. గణేష్‌ మండలి నిర్వాహకులు, భక్తులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. డీసీపీ భాస్కర్‌, ఏసిపీ ప్రకాష్‌, ఎంపీడీవో ప్రసాద్‌, సీఐ అల్లం నరేందర్‌, ట్రాన్స్‌కో డీఈ ప్రభాకర్‌, ఎస్సైలు ఉదయ్‌కిరణ్‌, సతీష్‌, అఽధికారులు, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 11:02 PM