Share News

‘వందే భారత్‌’కు హాల్టింగ్‌ ఇవ్వరూ...!

ABN , Publish Date - Sep 16 , 2024 | 11:03 PM

నాగ్‌పూర్‌-సికింద్రాబాద్‌ మధ్య నూతనంగా ప్రవేశపెట్టిన వందే భారత్‌ రైలుకు మంచిర్యాలలో హాల్టింగ్‌ ఇవ్వాలనే డిమాండ్‌లు రోజురోజుకూ పెరుగుతోంది. ఈ రైలు మంగళవారం మినహా రోజూ నడువనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వందేభారత్‌ రైలు సేవలు విశాఖ ప ట్నం-సికింద్రాబాద్‌, కాచిగూడ-తిరుపతి మధ్య నడుస్తున్నాయి.

‘వందే భారత్‌’కు హాల్టింగ్‌ ఇవ్వరూ...!

మంచిర్యాల, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): నాగ్‌పూర్‌-సికింద్రాబాద్‌ మధ్య నూతనంగా ప్రవేశపెట్టిన వందే భారత్‌ రైలుకు మంచిర్యాలలో హాల్టింగ్‌ ఇవ్వాలనే డిమాండ్‌లు రోజురోజుకూ పెరుగుతోంది. ఈ రైలు మంగళవారం మినహా రోజూ నడువనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వందేభారత్‌ రైలు సేవలు విశాఖ ప ట్నం-సికింద్రాబాద్‌, కాచిగూడ-తిరుపతి మధ్య నడుస్తున్నాయి. ఈ రెండు రైళ్లను దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించారు. తాజా సర్వీసు సెంట్రల్‌ రైల్వే కేటాయించిన నాగ్‌పూర్‌ డివిజన్‌కు చెందినది. సోమవారం ప్రధాని నరేంద్రమోదీ ఈ రైలుకు పచ్చజెండా ఊపనున్నారు.

మంచిర్యాలలో హాల్టింగ్‌ ఇవ్వాలి....

వందే భారత్‌ సేవలకు ప్రస్తుతం ప్రజల నుంచి అధిక డిమాండ్‌ లభి స్తోంది. దీని రవాణా చార్జీలు కొంత అధికంగా ఉన్నా ఆర్టీసీతో పోల్చితే పెద్ద గా తేడా ఏమీ లేదు. త్వరగా తమ ప్రయాణం ముగించాలనుకున్న వారం తా వందేభారత్‌ను ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రైలుకు ప్రస్తుతానికి రామగుండం, ఖాజీపేటలో మాత్రమే హాల్టింగ్‌ ఇస్తు న్నారు. మంచిర్యాలలో ఇవ్వకపోవడంతో ప్రయాణికులు తీవ్ర నిరాశకు గురవుతు న్నారు. వందేభారత్‌కు మంచిర్యాలలో హాల్టింగ్‌ ఇవ్వాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితోపాటు రైల్వే జీఎంకు లేఖలు రాశారు. మంచి ర్యాలలో హాల్టింగ్‌ ఇస్తే కాగజ్‌నగర్‌ నుంచి బెల్లంపల్లి, తదితర ప్రాంతాల నుంచి ప్రయాణికులు ఇక్కడి వచ్చే అవకాశం ఉంటుంది.

మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు అధిక సంఖ్యలో ప్రయాణం

మంచిర్యాల నుంచి ప్రయాణికులు అధిక సంఖ్యలో నిత్యం హైదరాబాద్‌ వెళ్తుంటారు. బస్సులో ప్రయాణించడం వల్ల అధిక సమయం వృథా అవుతోంది. మంచిర్యాల నుంచి రాత్రి సమయంలో ఎక్కువ మంది ప్రయా ణిస్తున్నారు. దీంతో ఆర్టీసీ లహరీ బస్సును ప్రవేశపెట్టంది. స్లీపర్‌ బస్సు కావడంతో దీనికి ఆదరణ ఉంది. అయితే తక్కువ సమయంలో వందేభారత్‌ రైలులో హైదరాబాద్‌ చేరే అవకాశం ఉంది.

వందేభారత్‌ రైలుకు రామగుండం నుంచి సికింద్రాబాద్‌ వెళ్లేం దుకు రూ.600ల పైచిలుకు ధరను నిర్ణయించారు. ఇంటర్‌సిటీ, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ తదితర సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లతో పోల్చితే వందేభారత్‌ టికెట్టు ధరలు సుమారు నాలుగు రెట్లు అధికంగా ఉన్నాయి. ఆర్టీసీలో కొత్తగా ప్రవేశపెట్టిన లహరీ ఏసీ బస్సుల్లో సీటింగ్‌ టికెట్టు రూ.600ల పైగానే ఉండగా స్లీపర్‌కు రూ. 800 పైనే ఉంది. మంచిర్యాల నుంచి సికింద్రాబాద్‌కు బస్సులో ప్రయాణానికి కనీసం ఐదు గంటల సమయం పడుతుండగా వందే భారత్‌ రైలు ద్వారా నాలుగు గంటల లోపు చేరుకునే వీలుంది. సమయం కలిసి రావడంతో పాటు వాష్‌రూమ్స్‌ సౌకర్యం కూడా ఉండటంతో ప్రయాణికులు మొగ్గు చూపే అవకాశాలున్నారు. మంచిర్యాల నుంచి కాజీపేట, హైదరాబాద్‌ లాంటి ప్రాంతాలకు నిత్యం వివిధ రైళ్ల ద్వారా మంచిర్యాల నుంచి కనీసం ఆరు వేల మంది ప్రయాణిస్తుండగా వారిలో కొందరు వందేభారత్‌ను ఆశ్రయించే వారు. ప్రయాణికులు మంచిర్యాల నుంచి గోదావరిఖని మీదుగా రామగుండం వెళ్లి అక్కడి నుంచి వందేభారత్‌ ఎక్కాల్సి ఉంటుంది. ఇది ప్రయాణికులకు అధిక వ్యయప్రయాసలను కలిగించే అంశం.

్జ3 గంటల్లోనే రాజధానికి

వందేభారత్‌ రైలు ఈ మార్గంలో నడపడాన్ని అంతా స్వాగతిస్తున్నారు. ప్రస్తుతానికి రామగుండంలో హాల్టింగ్‌ ఇవ్వడంతో అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు కేవలం మూడు గంటల్లోనే చేరుకోవచ్చు. తెలంగాణలో ఈ సర్వీసుకు కేవలం రామగుండం, ఖాజీపేటలో మాత్రమే హాల్టింగ్‌ కల్పించారు. రోజూ ఉదయం 5 గంటలకు నాగ్‌పూర్‌లో (ట్రైన్‌ నంబరు 20101) బయల్దేరుతుంది. రామగుండంలో ఉదయం 9.15 గంటలకు చేరుతుంది. సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12.15 గంటలకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు సికింద్రాబాద్‌ నుంచి (టైన్ర్‌ నెం.20102) బయల్దేరి రామగుండానికి మధ్యా హ్నం 3.15 గంటలకు చేరుకుంటుంది. 20 కోచ్‌లు ఉండే ఈ రైలు సోమవారం నుంచి సేవలు అందించనుంది.

Updated Date - Sep 16 , 2024 | 11:03 PM