Share News

సౌర విద్యుత్‌తోనే పర్యావరణ పరిరక్షణ

ABN , Publish Date - Sep 16 , 2024 | 10:57 PM

పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సోలార్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తోందని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. సోమవారం వెల్గనూర్‌ గ్రా మాన్ని సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేయగా విద్యుత్‌ శాఖ అధికారులతో కలిసి సం దర్శించారు.

 సౌర విద్యుత్‌తోనే పర్యావరణ పరిరక్షణ

దండేపల్లి, సెప్టెంబరు 16: పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సోలార్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తోందని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. సోమవారం వెల్గనూర్‌ గ్రా మాన్ని సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేయగా విద్యుత్‌ శాఖ అధికారులతో కలిసి సం దర్శించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ సోలార్‌ విద్యుత్‌ ద్వారా ఇంటింటికి విద్యుత్‌ సరఫరా, వ్యవ సాయ మోటార్లకు కూడా సౌర విద్యుత్‌ ఇస్తామన్నారు. సోలార్‌ పైలెట్‌ ప్రాజెక్టు ద్వారా నాణ్యమైన సౌర విద్యుత్‌ అందిస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరుతామన్నారు. నియోజకవర్గం లో రూ.30 కోట్లు కేటాయించి ప్రభు త్వ పాఠశాల అభివృద్ధికి చర్యలు చేప ట్టామన్నారు. రెబ్బనపల్లిలో ఇంటిగ్రే టెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల ఏర్పా టుకు చర్యలు చేపట్టామన్నారు. అనం తరం కలెక్టర్‌తో కలిసి ఎమ్మెల్యే ఇం టింటికి వెళ్ళి మహిళలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సోలార్‌ ఫైలెట్‌ ప్రాజెక్టు ఎంపిక చేయడంపై గ్రామస్ధులు కలెక్టర్‌, ఎమ్మెల్యేను సన్మానించారు. గిరిజన కార్పొరేషన్‌ చైర్మన్‌ తిరుపతి, ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్‌, డీఈ ఖైజర్‌, ఏడీఏ ప్రభాకర్‌రావు, డీసీసీ అధ్యక్షురాలు కోక్కిరాల సురేఖ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రేమ్‌చందు, తహసీల్దార్‌ సంధ్యరాణి, ఎంపీడీవో ప్రసాద్‌, నాయకులు గడ్డం త్రిమూర్తి, శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు, సతీష్‌ , శంకరయ్య పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 10:57 PM