గణనాధుడి పూజకు వేళాయే...
ABN , Publish Date - Sep 06 , 2024 | 10:51 PM
గణపతి నవరాత్రోత్సవాలకు సర్వం సిద్ధమైం ది. శనివారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాల్లో భాగంగా గణపతి ప్రతిమకు భక్తి శ్రద్ధలతో పూజించి అనంతరం నిమజ్జనం చేస్తారు. గణ పతి మండళ్ళను నిర్వాహకులు రంగురంగుల విద్యుత్ దీపాలతో నిర్వా హకులు ముస్తాబు చేశారు. జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం 9 గం టల నుంచి 12 గంటల వరకు చవితి శుభ గడియలో ఆయా మండ పాల్లో గణపతి విగ్రహాలను నెలకొల్పనున్నారు.
నస్పూర్, సెప్టెంబరు 6: గణపతి నవరాత్రోత్సవాలకు సర్వం సిద్ధమైం ది. శనివారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాల్లో భాగంగా గణపతి ప్రతిమకు భక్తి శ్రద్ధలతో పూజించి అనంతరం నిమజ్జనం చేస్తారు. గణ పతి మండళ్ళను నిర్వాహకులు రంగురంగుల విద్యుత్ దీపాలతో నిర్వా హకులు ముస్తాబు చేశారు. జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం 9 గం టల నుంచి 12 గంటల వరకు చవితి శుభ గడియలో ఆయా మండ పాల్లో గణపతి విగ్రహాలను నెలకొల్పనున్నారు. విభిన్న రూపాల్లో కొలువు దీరిన గణనాథుడు నవరాత్రులు పూజలందుకోనున్నాడు. నవరాత్రులు భక్తి పాటలు, భజనలు, పూజలు, అన్నదానాలు నవరాత్రుల కోలాహలం కొనసాగనుంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 650కి పైగా గణేష్ మండళ్ళను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
వినాయకుడిని ఆరాధిచండమంటేనే ప్రకృతిని పూజించడమని భావి స్తారు. పూజలో వినియోగించే మట్టి నుంచి పసుపు, ఆకులు అణు వణువునా ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ప్రకృతిలో లభించే 21 రకాల పత్రిలో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. వర్షాకాలంలో లభించే మొక్కలు ఈ సీజన్లో వ్యాప్తి చెందే ఆరోగ్య సమస్యలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెబుతారు.
మార్కెట్లో సందడి
గణపతి పూజలకు అవసరమైన పూజా సామగ్రి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. చిరు వ్యాపారులు గణపతి పూజకు అవసరమైన ఆకులు, మారేడు, నేరుడు కాయలు, తమలపాకులు, ఆరటి పండ్లు తదితర పూజలకు వినియోగించే సామగ్రి కొనుగోళ్ళు జోరుగా సాగుతున్నాయి. అంతే కాకుండా పూజా దుకాణాల్లో సామగ్రి కాగితపు పూల దండలు, దారాలు, రిబ్బన్స్, ఇతర అలంకరణ సామగ్రి అమ్మకాలు జరిగాయి.
పెరిగిన పూల ధరలు...
గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మార్కెట్లో పూల ధరలు విపరీతంగా పెరిగాయి. బంతి పూలు కిలో రూ.120, చామంతి -రూ. 700 నుంచి 800వరకు, మల్లె, సన్నజాజి, గులాబీలు రూ. 150 నుంచి రూ. 250వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. డజను అరటి పండ్లు రూ. 70, జామ రూ. 150, అపిల్ రూ. 100 నుంచి 250 వరకు, కొబ్బరి కాయలు రూ. 20 నుంచి 22వరకు లభిస్తున్నాయి. ఆంధ్రలో వర్షాలు, వరదల ఫలితంగా పూలపై ధరల ప్రభావం పడినట్లు వ్యాపారులు చెబుతున్నారు.