Share News

తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం

ABN , Publish Date - Sep 17 , 2024 | 10:50 PM

సచివాలయం ఎదుట మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ మంగళ వారం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తంచేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన ప్రాంతంలో రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పా టు సరైంది కాదన్నారు.

తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం

నస్పూర్‌, సెప్టెంబరు 17: సచివాలయం ఎదుట మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ మంగళ వారం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తంచేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన ప్రాంతంలో రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పా టు సరైంది కాదన్నారు. నడిపెల్లి విజిత్‌ కుమార్‌, అక్కూరి సుబ్బయ్య, మెరుగు పవన్‌కుమార్‌, రాజేంద్రపాణి, సురేందర్‌ రెడ్డి పాల్గొన్నారు.

బెల్లంపల్లి: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేసినట్లు నాయకులు బత్తుల సుదర్శన్‌, సత్యనారాయణలు తెలిపారు. వారు మాట్లాడుతూ అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పాల న్నారు. రేవెల్లి విజయ్‌, ఆలీ, సత్యనారాయణ, అరుణ్‌ పాల్గొన్నారు.

మందమర్రి టౌన్‌: రాష్ర్టీయ రహదారి వద్ద బీఆర్‌ఎస్‌ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జె రవిందర్‌, డా రమేష్‌రాజా, రాజశేఖర్‌, మేడిపెల్లి సంపత్‌, సూరిబాబు, వెంకటేష్‌, తిరుపతిరెడ్డి, అబ్బాస్‌, పాల్గొన్నారు.

చెన్నూరు: సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిం చడం అవివేకమని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. కొత్త బస్టాండ్‌ ప్రాంతంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. మాజీ ఎంపీపీ బాపు, మాజీ జెడ్పీటీసీ తిరుపతి, నాయకులు రాంలాల్‌గిల్డా, కౌన్సిలర్‌ మహేష్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2024 | 10:50 PM