Share News

MLA Harish Babu: బ్లీచింగ్ పౌడర్‌కు కూడా డబ్బులు లేవా?: ఎమ్మెల్యే హరీశ్ బాబు

ABN , Publish Date - Jul 08 , 2024 | 06:52 PM

తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ, చికెన్ గున్యా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని సిర్పూర్(Sirpur) ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు(MLA Palvai Harish Babu) తెలిపారు. బ్లీచింగ్ పౌడర్ కొనేందుకు కూడా పంచాయతీల్లో నిధులు లేవంటూ వార్తలు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పారిశుద్ధ్య లోపం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. మురుగు నిర్వహణ పనులు చేయించేందుకు కూడా నిధులు లేవా అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు.

MLA Harish Babu: బ్లీచింగ్ పౌడర్‌కు కూడా డబ్బులు లేవా?: ఎమ్మెల్యే హరీశ్ బాబు

ఆసిఫాబాద్: తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ, చికెన్ గున్యా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని సిర్పూర్(Sirpur) బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు(MLA Palvai Harish Babu) తెలిపారు. బ్లీచింగ్ పౌడర్ కొనేందుకు కూడా పంచాయతీల్లో నిధులు లేవంటూ వార్తలు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పారిశుద్ధ్య లోపం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. మురుగు నిర్వహణ పనులు చేయించేందుకు కూడా నిధులు లేవా అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇచ్చే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023-24 చివరి క్వార్టర్ వరకు పంచాయతీలకు నిధులు మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం జీతాలకు వాడకూడదని, వెంటనే పారిశుద్ధ్య పనుల నిర్వహణకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు డిమాండ్ చేశారు.


నిధులు లేక పట్టణాలు, పల్లెల్లో దారుణ పరిస్థితులు..

రాష్ట్రంలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక అంటువాధ్యుల బారిన పడుతున్నా నిధులు విడుదల చేయకుండా ప్రజల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు మండిపడ్డారు. సెప్టెంబర్ నుంచి ఒక్క రూపాయి కూడా పంచాయతీలకు రాలేదని, గ్రామాల్లో కనీస సదుపాయాలు కల్పించేందుకు కూడా నిధులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పట్టణాలు, పల్లెల్లో పరిస్థితులు దారుణంగా మారాయని ఎమ్మెల్యే చెప్పారు. తెలంగాణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివాలా తీయించారన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో ప్రజల దుస్థితి ఒక్కసారైనా చూడాలన్నారు. కేశవరావు విషయంలో తీసుకున్న రాజీనామా నిర్ణయం.. బీఆర్ఎస్ నుంచి చేరిన మిగతా వారి విషయంలో ఎందుకు తీసుకోలేదో చెప్పాలంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో సీఎంతో సహా మంత్రులు అవినీతిలో మునిగిపోయారని ఆరోపణలు గుప్పించారు.


రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1,200కోట్లను కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ ఫండ్ కింద వాడుకున్నారని ఎమ్మెల్యే హరీశ్ బాబు సంచలన ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట కలెక్టర్లకే ఫుల్ పవర్స్ ఇచ్చారని, ప్రభుత్వ కార్యక్రమాలకు వారు కాంగ్రెస్ జెండాలు కడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ధర్నాలు చేస్తే గానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. మా సొంత నియోజకవర్గాల్లోనే మేము సెకండ్ క్లాస్ సిటిజన్లుగా బతుకుతున్నామంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలానే చేస్తే తెలంగాణ రాష్ట్రం అదోగతి పాలు కావడం ఖాయం అని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు జోస్యం చెప్పారు.

ఇవి కూడా చదవండి:

MP Etela: ప్రియ ఎన్‌క్లేవ్‌లో ఇళ్ల కూల్చివేతపై ఎంపీ ఈటెల ఫైర్..

Liquor case: ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో విచారణ శుక్రవారానికి వాయిదా..

Balkampet Yellamma Talli: మెుదలైన బల్కంపేట్ ఎల్లమ్మతల్లి కల్యాణ ఉత్సవం..

Updated Date - Jul 08 , 2024 | 06:55 PM