Share News

స్వచ్ఛతా హీ సేవ పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Sep 17 , 2024 | 10:52 PM

ప్రభుత్వం ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు తలపెట్టిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అద నపు కలెక్టర్‌ మోతిలాల్‌తో కలిసి సమావేశం నిర్వహిం చారు.

స్వచ్ఛతా హీ సేవ పకడ్బందీగా నిర్వహించాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 17: ప్రభుత్వం ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు తలపెట్టిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అద నపు కలెక్టర్‌ మోతిలాల్‌తో కలిసి సమావేశం నిర్వహిం చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ స్వచ్ఛతాహీ సేవా కార్యక్ర మంలో భాగంగా అన్ని గ్రామాల్లో ప్రజలు, ప్రజాప్రతి నిధులు, యువజన సంఘాల ఆధ్వర్యంలో వన మహో త్సవంలో భాగంగా మొక్కలు నాటడం, స్వచ్ఛత ప్రతిజ్ఞ నిర్వహిస్తామన్నారు. అనంతరం అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు.

నస్పూర్‌: స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యా ర్థులు, అధికారులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మానవహారం నిర్వహించి స్వచ్ఛతా ప్రతిజ్ఞను చేశారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశు భ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం 15వ వార్డులో తడి చెత్త-పొడి చెత్తపై స్థానికులకు అవగాహన కల్పిం చారు. మున్సిపల్‌ చైర్మన్‌ సుర్మిళ్ల వేణు, వైస్‌చైర్‌పర్సన్‌ గెల్లు రజితమల్లేష్‌, కమిషనర్‌ చిట్యాల సతీష్‌, ఎన్విరాన్‌ మెంట్‌ ఇంజనీర్‌ ప్రశాంత్‌, వార్డు ఆఫీసర్స్‌, మున్సిపల్‌ సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మందమర్రి టౌన్‌: పరిసరాల పరిశుభ్రత కోసమే స్వచ్ఛత హీ సేవ అని మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రధాన సెంటర్‌లో ప్రతిజ్ఞ నిర్వహించారు. వార్డులు, ప్రధాన కూడళ్లలో చెత్త లేకుండా పారిశుధ్య కార్యక్రమాలు చేపడతామన్నారు. పట్టణం మనదనే భావనతో ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరిస్తే అపరి శుభ్రత ఉండదని తెలిపారు. డ్వాక్రా గ్రూపు మహిళలు ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. మున్సిపల్‌ సిబ్బందితో పాటు కాంగ్రెస్‌ పార్టీ పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎస్‌ ప్రభాకర్‌ రావు, సొత్కు సుదర్శన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2024 | 10:52 PM