Share News

వీరుల త్యాగం చిరస్మరణీయం

ABN , Publish Date - Sep 17 , 2024 | 10:57 PM

రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛ కోసం పోరాడిన వీరుల త్యాగం చిరస్మరణీయమని, నాటి పోరాటాల ఫలి తంగా ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని, వీరయోధుల ను స్మరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌ పేర్కొన్నారు. మంగళవారం ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో జెండాను ఆవిష్క రించారు.

వీరుల త్యాగం చిరస్మరణీయం

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 17: రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక స్వేచ్ఛ కోసం పోరాడిన వీరుల త్యాగం చిరస్మరణీయమని, నాటి పోరాటాల ఫలి తంగా ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని, వీరయోధుల ను స్మరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌ పేర్కొన్నారు. మంగళవారం ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో జెండాను ఆవిష్క రించారు. ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రంగా అవతరిం చిన తెలంగాణ అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రభు త్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ప్రజల మన్నన పొందిందన్నారు. జాతీయ సమైక్యత కు ప్రతీకగా నిలిచే సెప్టెంబరు 17ను ప్రజల సార్వ భౌమత్వం గుండెల్లో నింపుకుని ప్రజల సర్వతోము ఖాభి వృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుంద న్నారు. అర్హులైన రైతులకు రుణమాఫీ, మహాలక్ష్మీ, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి, రుణమాఫీలో ఎన్నడూ జరగని విధంగా అన్నివర్గాల ప్రజలను ఆదుకున్నామ న్నారు. జిల్లా అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, గడ్డం వినోద్‌, కనీస వేతనాల కార్పొరేషన్‌ చైర్మన్‌ జనక్‌ప్రసాద్‌, అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, డీసీపీ భాస్కర్‌, డీఎఫ్‌వో శివ్‌ఆశిష్‌ సింగ్‌, అధికారులు దుర్గా ప్రసాద్‌, గణపతి, రవీందర్‌రెడ్డి, ఏసీపీ ప్రకాష్‌, సీఐలు అశోక్‌, సుధాకర్‌, బన్సీలాల్‌ పాల్గొన్నారు.

జడ్పీ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ జెండాను ఆవిష్క రించారు. జెడ్పీసీఈవో గణపతి, అధికారులు పాల్గొ న్నారు. ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు నివాసంలో ప్రజాపా లన దినోత్సవాన్ని నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు సురేఖ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

నస్పూర్‌: నస్పూర్‌ మున్సిపాలిటీ కార్యా లయం వద్ద ప్రజాపాలన దినోత్సవం సంద ర్భంగా జాతీయ జెండాను మున్సిపల్‌ చైర్మ న్‌ సుర్మిళ్ళ వేణు ఆవిష్కరించారు. మున్సిప ల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ గెల్లు రజితమల్లేష్‌, కమి షనర్‌ చిట్యాల సతీష్‌, కౌన్సిలర్లు, కో అప్షన్‌ సభ్యులు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2024 | 10:57 PM