KTR vs Revanth: సీఎం సాబ్.. ఆ మాట మర్చిపోయారా? రేవంత్‌పై కేటీఆర్ సీరియస్
ABN , Publish Date - Nov 18 , 2024 | 06:20 PM
KTR vs Revanth: లగచర్ల ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ మరోమారు రియాక్ట్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్‌గా చేసుకొని ఆయన విమర్శలకు దిగారు. ఇంతకీ కేటీఆర్ ఏమన్నారంటే..
న్యూఢిల్లీ: కొడంగల్‌లోని లగచర్ల సంఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వివాదాన్ని ఆధారంగా చేసుకొని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అల్లుడి కంపెనీల కోసం ముఖ్యమంత్రి నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తున్నారని కేటీఆర్ అన్నారు. తరతరాల నుంచి వారసత్వంగా వచ్చిన భూములను రైతుల నుంచి లాక్కుంటున్నారని ఆరోపించారు. 9 నెలలుగా ఆందోళన చేస్తున్నా వారి వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదని సీరియస్ అయ్యారు. జిల్లా మంత్రి, పరిశ్రమల మంత్రితో పాటు అధికారులు కూడా పట్టించుకోవడం లేదన్నారు. అంతేగాక వాళ్లపై కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు.
ఇదేనా రాజ్యాంగ రక్షణ?
మణిపూర్, ఉత్తర్‌ప్రదేశ్ లేదా లక్ష్యద్వీప్.. ఇలా దేశంలోని ఏ మూల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నా బాధపడుతున్నామని కేటీఆర్ తెలిపారు. కానీ లగచర్ల దురాగతం గురించి మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. తమ పార్టీ రాజ్యాంగ పరిరక్షణ కోసం పనిచేస్తుందని రాహుల్ గాంధీ అంటున్నారని.. ఇదేనా రాజ్యాంగ రక్షణ అని ప్రశ్నించారు. మణిపూర్ గురించి పదేపదే మాట్లాడే రాహుల్.. కొడంగల్‌లోని లగచర్ల గురించి మాత్రం మాట్లాడటం లేదన్నారు.
మోడీ మర్చిపోయారు
ఒక్క పిలుపు ఇస్తే ప్రజల ముందు వాలిపోతానని ఎన్నికల సమయంలో రేవంత్ హామీ ఇచ్చారని.. ఇప్పుడు ఏమైపోయారని కేటీఆర్ క్వశ్చన్ చేశారు. ఆయన కలిస్తే తమ బాధలు చెప్పుకునేందుకు లగచర్ల బాధితులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఢిల్లీలో కలుస్తామంటే దానికి కూడా రెడీగా ఉన్నారని చెప్పారు. మాటలతో ప్రేమ కురిపిస్తే సరిపోదని.. చేతల్లో చూపించాలన్నారు కేటీఆర్. తెలంగాణ అనే ఒక రాష్ట్రం ఉందని ప్రధాని మోడీ మర్చిపోయినట్లు ఉందన్నారు. త్వరలో లోక్‌సభలో లగచర్ల బాధితుల తరఫున తమ గొంతు వినిపిస్తామన్నారు. కొడంగల్‌లోనే కాదు.. ఫార్మా విలేజీలు ప్రతిపాదించిన ప్రతి చోటా ఈ పోరాటం జరుగుతోందన్నారు కేటీఆర్.
Also Read:
టీటీడీ సంచలన నిర్ణయాలు..
సీఎం రేవంత్‌కు ఎంపీ డీకే అరుణ సవాల్
బీఆర్ఎస్ సోషల్ మీడియా హెడ్ అరెస్ట్
For More Telangana And Telugu News