Share News

NIMS: నిమ్స్‌ ఆస్పత్రి నుంచి చెంచు మహిళ డిశ్చార్జి..

ABN , Publish Date - Jul 01 , 2024 | 04:44 AM

పనికిరావడంలేదని యజమానులు గదిలో నిర్భంధించి పాశవికంగా హింసించిన ఘటనలో గాయపడిన నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం మొలచింతలపల్లికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మ (20) నిమ్స్‌ ఆస్పత్రిలో కోలుకుని ఆదివారం డిశ్చార్జ్‌ ఆయ్యారు.

NIMS: నిమ్స్‌ ఆస్పత్రి నుంచి చెంచు మహిళ డిశ్చార్జి..

  • నేడు చెంచు గూడాలకు మంత్రి సీతక్క

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): పనికిరావడంలేదని యజమానులు గదిలో నిర్భంధించి పాశవికంగా హింసించిన ఘటనలో గాయపడిన నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం మొలచింతలపల్లికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మ (20) నిమ్స్‌ ఆస్పత్రిలో కోలుకుని ఆదివారం డిశ్చార్జ్‌ ఆయ్యారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ పాశంయాదగిరి, దయాల జితేందర్‌ నిమ్స్‌ ఆస్పత్రిలో ఆమెను పరామర్శించారు. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వారి భూములను బలవంతంగా గుంజుకుంటున్నారని పాశం యాదగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు.


ప్రభుత్వ పెద్దలకు అన్నీ తెలిసి మౌనంగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. మంత్రి సీతక్కతో పాటు, నిమ్స్‌ ఆస్పత్రి, నాగర్‌కర్నూల్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందికి బాధితురాలు ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా మంత్రి సీతక్కతో పాటు ఆదివాసీ హక్కుల సంఘాల ప్రతినిధులు సోమవారం చెంచుగూడాలను సందర్శించనున్నారు.

Updated Date - Jul 01 , 2024 | 04:44 AM