Share News

CM Revanth Redyy: 2029లో షర్మిలే ఏపీ సీఎం

ABN , Publish Date - Jul 09 , 2024 | 02:36 AM

‘‘కాంగ్రె్‌సకు దెబ్బ తగిలిన కడప జిల్లా నుంచే జెండా ఎగురవేద్దాం.. ఉప ఎన్నిక వస్తుందని ప్రచారం జరుగుతోంది.. వస్తే షర్మిల తరఫున ఊరూరా తిరిగే బాధ్యత నాదే..’’ అని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

CM Revanth Redyy: 2029లో షర్మిలే ఏపీ సీఎం

  • ఉప ఎన్నిక వస్తే ఊరూరా తిరుగుతా

  • కడప నుంచే కాంగ్రెస్‌ జెండా ఎగరేద్దాం

  • వైఎస్‌ జయంతి సభలో సీఎం రేవంత్‌

  • బీజేపీతో పొత్తు పెట్టుకున్నవారు వైఎస్‌ వారసులా?: షర్మిల

అమరావతి, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ‘‘కాంగ్రె్‌సకు దెబ్బ తగిలిన కడప జిల్లా నుంచే జెండా ఎగురవేద్దాం.. ఉప ఎన్నిక వస్తుందని ప్రచారం జరుగుతోంది.. వస్తే షర్మిల తరఫున ఊరూరా తిరిగే బాధ్యత నాదే..’’ అని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఏపీలో ప్రతిపక్షం లేదని, ప్రజల తరఫున ఆ పాత్ర పోషించేది పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మాత్రమేనని అన్నారు. ఆమెకు తోడుగా, ఏపీలోని ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్తకు అండగా తాము ఉంటామన్నారు. వైఎస్‌ జయంతిని పురస్కరించుకుని సోమవారం మంగళగిరిలోని సి.కె. కన్వెన్షన్‌లో సభ నిర్వహించారు. సీఎంతోపాటు మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌ హాజరయ్యారు.


ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్‌, పవన్‌ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సర్పంచ్‌ను కూడా గెలిపించుకోలేని స్థితిలో కాంగ్రెస్‌ ఉన్నప్పుడు ముళ్లబాటను ఎంచుకున్న షర్మిల.. 1999లో తన తండ్రి ప్రతిపక్ష నేతగా పోరాడిన స్ఫూర్తితో ఏపీ ప్రజల తరఫున కొట్లాడతారని అన్నారు. 1984లో పోరాటం మొ దలు పెట్టిన వైఎస్‌ 2004లో సీఎం అయ్యారని, తండ్రిని కోల్పోయి అనివార్య పరిస్థితుల్లో 2009లో రాజకీయ ప్రవేశం చేసిన షర్మిల 2029లో ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. 2007లో శాసన మండలిలో మొదటిసారి అడుగు పెట్టిన తాను ముందు రోజు రాత్రంతా ప్రజా సమస్యలపై ప్రిపేరై మరుసటి రోజు ప్రస్తావిస్తే వైఎస్‌ ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. ఏళ్ల తరబడి కష్టపడినా పదవి రాలేదని ఎన్నడూ పార్టీని వదల్లేదని, 2004 పాదయాత్రతో అధికారంలోకి వచ్చారని చెప్పారు.


నిత్యం ప్రజల కోసమే నాన్న (వైఎస్‌) తపన పడే వారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఏళ్ల తరబడి రాజకీయాల్లో ప్రజల తరఫున పనిచేసిన ఆయన.. ముఖ్యమంత్రి అయ్యాక మరింత బాధ్యతతో పని చేశారని చెప్పారు. దేశానికి, రాష్ట్రానికి కాంగ్రె్‌సతోనే మంచి జరుతుందని విశ్వసించే తన తండ్రికి మత రాజకీయాలు చేసే బీజేపీ అంటే అసలు గిట్టదని, అదే బీజేపీతో తెరవెనుక రాజకీయాలు చేసే నాయకులు (జగన్‌) వైఎ్‌సకు వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు. వైఎస్‌ తనకు ఆదర్శమంటూ పాదయాత్రలో చెప్పిన రాహుల్‌ పార్లమెంటులో మోదీని నిలదీస్తున్న తీరు చూస్తుంటే భావి ప్రధాని కనిపించాడని వ్యాఖ్యానించారు.

Updated Date - Jul 09 , 2024 | 02:36 AM