Warangal: ప్రపంచస్థాయి వైద్య సదుపాయాలు..
ABN , Publish Date - Jun 30 , 2024 | 03:12 AM
వరంగల్‌లో 300 పడకలతో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు మెడికవర్ ఆలిండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్‌కృష్ణ తెలిపారు. ఈ ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్లతోపాటు ఎక్కువ సంఖ్యలో ఐసీయూ బెడ్స్ ఉన్నాయని చెప్పారు.
నలుగురితో ప్రారంభించి లక్షల మందికి సేవలందిస్తున్నాం
మెడికవర్ ఆలిండియా సీఎండీ డాక్టర్ అనిల్‌కృష్ణ వెల్లడి
బాలసముద్రం, జూన్ 29: వరంగల్‌లో 300 పడకలతో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు మెడికవర్ ఆలిండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్‌కృష్ణ తెలిపారు. ఈ ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్లతోపాటు ఎక్కువ సంఖ్యలో ఐసీయూ బెడ్స్ ఉన్నాయని చెప్పారు. భారత దేశంలో అగ్రగామి మల్టీ నేషనల్ ఆస్పత్రి చైన్‌గా 24 ఆస్పత్రులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 12 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ హెల్త్ కేర్ బ్రాండ్‌గా గుర్తింపుపొందిన మెడికవర్.. 24వ ఆస్పత్రిని వరంగల్‌లో శనివారం ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డిని, మంత్రులను మెడికవర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు శరత్‌రెడ్డి, హరికృష్ణతో కలిసి డాక్టర్ అనిల్‌కృష్ణ శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2015లో నలుగురితో ప్రారంభించిన మెడికవర్ ఆస్పత్రి.. లక్షల మందికి వైద్య సేవలందించి కరోనా సమయంలో లక్షలాది మందికి ఉచితంగా వ్యాక్సినేషన్ అందించినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మెడికవర్ సేవలను వినియోగించుకోవాలని, రాష్ట్రాన్ని హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు మెడికవర్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి తాను అభిమానినని, రేవంత్ సీఎం కాకముందు అనేక కష్టాలను ఎదుర్కొని లక్ష్యాన్ని సాధించారని ప్రశంసించారు. ఆయన చేతులమీదుగా మెడికవర్ ఆస్పత్రిని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు