Share News

Krishna Basin: కృష్ణా ప్రాజెక్టులకు స్వల్పంగా వరద

ABN , Publish Date - Sep 16 , 2024 | 04:10 AM

కృష్ణా బేసిన్‌లో వరద తగ్గుముఖం పట్టడంతో.. ప్రాజెక్టుల గేట్లు బంద్‌ అయ్యాయి.

Krishna Basin: కృష్ణా ప్రాజెక్టులకు స్వల్పంగా వరద

గద్వాల/నాగార్జునసాగర్‌, సెప్టెంబరు 15 : కృష్ణా బేసిన్‌లో వరద తగ్గుముఖం పట్టడంతో.. ప్రాజెక్టుల గేట్లు బంద్‌ అయ్యాయి. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు 32 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 27,500 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌కు 30 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 20.500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 40 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. జలాశయం గేట్లు మూసి విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 27,319 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.


శ్రీశైలం రిజర్వాయర్‌కు 59 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 68 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌కు 67,194 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో ఉంది. కుడి కాల్వకు 10వేల క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 4,679 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్‌ కేంద్రం నుంచి 28,048 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,800 క్యూసెక్కులు, నాలుగు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 32,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Updated Date - Sep 16 , 2024 | 04:10 AM