Share News

Patanacheru: కాంగ్రెస్‌ గూటికి మహిపాల్‌రెడ్డి

ABN , Publish Date - Jul 16 , 2024 | 04:05 AM

కాంగ్రె్‌సలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి.. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు.

Patanacheru: కాంగ్రెస్‌ గూటికి మహిపాల్‌రెడ్డి

  • పటాన్‌చెరు ఎమ్మెల్యేను పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్‌రెడ్డి 10కి పెరిగిన కాంగ్రె్‌సలో చేరిన బీఆర్‌ఎస్‌ శాసనసభ్యుల సంఖ్య

  • కండువా కప్పి ఆహ్వానించిన సీఎం తిరిగి వచ్చిన గాలి అనిల్‌కుమార్‌

హైదరాబాద్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): కాంగ్రె్‌సలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి.. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. ఆయనతోపాటు జహీరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌, పలువురు కార్పొరేటర్లు, నేతల అనుచరులు కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, దామోదర రాజనర్సింహ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మల తదితరులు పాల్గొన్నారు. గూడెం మహిపాల్‌రెడ్డి కుటుంబంపై మైనింగ్‌ కేసులు నమోదు కావడం, ఆ తర్వాత ఈడీ సోదాలు చేపట్టడం తెలిసిందే.


అది జరిగిన కొన్ని రోజులకే సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు.. మహిపాల్‌రెడ్డి కూడా వెళ్లడంతో కాంగ్రె్‌సలో ఆయన చేరుతారని ప్రచారం జరిగింది. చివరకు ఆదివారం తన అనుచరులతో సంప్రదింపులు జరిపిన మహిపాల్‌రెడ్డి.. కాంగ్రె్‌సలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం తన అనుచరులతో పాటు సీఎం సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ దక్కక పోవడంతో బీఆర్‌ఎ్‌సలో చేరిన గాలి అనిల్‌కుమార్‌.. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సోమవారం ఆయన కూడా సీఎం రేవంత్‌ సమక్షంలో కాంగ్రెస్‌ గూటికి చేరారు.


కాగా, మహిపాల్‌రెడ్డి చేరికతో కాంగ్రె్‌సలో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరింది. ఫిరాయింపుల నిరోధక చట్టంలోని వెసులుబాటు ప్రకారం మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరితేనే టీఆర్‌ఎ్‌సఎల్పీ విలీనమైనట్లుగా పరిగణిస్తారు. ఈ లెక్కన 26మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరాల్సి ఉంది. ఈ లెక్కన మరో 16మంది ఎమ్మెల్యేలు చేరితే సీఎల్పీలో బీఆర్‌ఎ్‌సఎల్పీ విలీనం కానుంది. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో చేరికల ప్రక్రియను సీఎం వేగవంతం చేయనున్నట్లు చెబుతున్నారు.

Updated Date - Jul 16 , 2024 | 04:06 AM