Share News

Hyderabad: జనసేన జెండాలో.. శ్రీచక్ర యంత్రాన్ని పెట్టడం అన్యాయం

ABN , Publish Date - Jul 16 , 2024 | 11:41 AM

పరబ్రహ్మ స్వరూపం అయిన ఆదిపరాశక్తి అమ్మవారి శ్రీచక్ర యంత్రాన్ని జనసేన పార్టీ(Janasena party) తన జెండాకు ఉపయోగించడం అన్యాయం అని, ఇది అమ్మవారిని, హైందవ ధర్మాన్ని అవమానించడమేనని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కమల సంతోష్ కుమార్‌ అన్నారు

Hyderabad: జనసేన జెండాలో.. శ్రీచక్ర యంత్రాన్ని పెట్టడం అన్యాయం

హైదరాబాద్: పరబ్రహ్మ స్వరూపం అయిన ఆదిపరాశక్తి అమ్మవారి శ్రీచక్ర యంత్రాన్ని జనసేన పార్టీ(Janasena party) తన జెండాకు ఉపయోగించడం అన్యాయం అని, ఇది అమ్మవారిని, హైందవ ధర్మాన్ని అవమానించడమేనని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కమల సంతోష్ కుమార్‌ అన్నారు. రాజకీయాలకు అమ్మవారి చిహ్నాన్ని ఉపయోగించుకోవడం హిందూ ధర్మాన్ని తుంగలో తొక్కడమేనని వాపోయారు. బాగ్‌లింగంపల్లిలో తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జనసేన పార్టీలో శ్రీచక్ర యంత్రం చిహ్నాన్ని అనుమతించిన కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అధికారులు బాధ్యత వహించాలన్నారు.

ఇదికూడా చదవండి: పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు


city4.jpg

దీనిపై డీజీపీ జితేందర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(AP Deputy CM Pawan Kalyan) పునరాలోచించి శ్రీచక్ర యంత్రాన్ని జెండా నుంచి ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ విషయంపై ఆదిపరాశక్తికి క్షమాపణ చెప్పడంతో రుద్రాభిషేకం, శాంతి హోమాలను రాష్ట్రవ్యాప్తంగా పవన్‌ కల్యాణ్‌ తన సొంత ఖర్చులతో నిర్వహించాలని ఆయన కోరారు. పార్టీ జెండాలో శ్రీచక్ర యంత్రాన్ని తొలగించకపోతే న్యాయ పోరాటం చేస్తానన్నారు.


ఇదికూడా చదవండి: హైదరాబాద్‏లో కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 16 , 2024 | 11:41 AM