Share News

Aravind: పీవీను కాంగ్రెస్ అవమానపరిచింది

ABN , Publish Date - Feb 09 , 2024 | 10:38 PM

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న ఇవ్వడం తెలుగు ప్రజలందరూ సంతోషించే విషయమని బీజేపీ ఎంపీ అరవింద్(Aravind) అన్నారు.

Aravind: పీవీను కాంగ్రెస్ అవమానపరిచింది

ఢిల్లీ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న ఇవ్వడం తెలుగు ప్రజలందరూ సంతోషించే విషయమని బీజేపీ ఎంపీ అరవింద్(Aravind) అన్నారు. శుక్రవారం నాడు ఆయన ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడుతూ.. పీవీను కాంగ్రెస్ అవమానపరిచిందని.. ఆయన పార్థివ దేహాన్ని కనీసం ఆ పార్టీ ఆఫీసులో అనుమతించలేదని మండిపడ్డారు. తెలంగాణలో ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి పౌర స్మృతి ఉండాలని కోరారు. తెలంగాణలో భూముల కుంభకోణం, కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కేసుల దర్యాప్తుకు సీబీఐకు జనరల్ కన్సెంట్ ఇవ్వాలని కోరారు. కేసీఆర్ అవినీతిపై దర్యాప్తునకు సీబీఐకి అనుమతి ఇవ్వాలన్నారు. యూనిఫాం సివిల్ కోడ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ దర్యాప్తునకు సహకరించాలన్నారు. ఈడీ విచారణకు హాజరుకావాలని.. తప్పు చేయకపోతే కవిత ఈడీ విచారణకు ఎందుకు ? సహకరించదని అరవింద్ ప్రశ్నించారు.

Updated Date - Feb 09 , 2024 | 10:38 PM