TG News: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఎస్సీ వర్గీకరణకు ఏకసభ్య కమిషన్..
ABN , Publish Date - Oct 09 , 2024 | 07:04 PM
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలంటూ అధికారులను సీఎం ఆదేశించారు.
హైదరాబాద్: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలంటూ అధికారులను సీఎం ఆదేశించారు. ఆ కమిషన్ 60రోజుల్లో నివేదిక ఇచ్చేలా చూడాలంటూ సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. వర్గీకరణనకు 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోనున్నట్లు రేవంత్ చెప్పారు. మరో 24గంటల్లో కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై కొన్ని రోజులుగా కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తోంది. దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయగా.. పలు అంశాలపై చర్చించిన సబ్ కమిటీ సభ్యులు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, సబ్ కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు సమావేశమై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని తీర్మానించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పలు విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. " కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొరివి దయ్యాన్ని కొని తెచ్చుకుని రెండు సార్లు ముఖ్యమంత్రిని చేశారు. ఆ కొరివి దయ్యం నిరుద్యోగ సమస్యను పట్టించుకోలేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత ఉద్యోగాలు ఊడితేనే మీకు ఉద్యోగాలు వస్తాయని నేను ముందే చెప్పాను. చెప్పినట్లుగానే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 90రోజుల్లో 30వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాల నియామకపత్రాలు అందించాం. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బదిలీ సమస్యను పరిష్కరించాం. 34వేల మందిని బదిలీలు చేశాం. మీ సంతోషం చూసి కొందరు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. కేసీఆర్ నువ్వు చేసిన తప్పిదాలకు నీ బిడ్డని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిస్తే ఎమ్మెల్సీని చేశావు. నీ బంధువు బోయినపల్లి వినోద్‌ను ఓడిస్తే ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్‌ను చేశావు.
కస్టమర్లకు బిగ్ అలర్ట్.. బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు
తెలంగాణ కోసం త్యాగం చేసిన నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు. మీ ఇంట్లో సంతోషం ఉండాలి కానీ పేద ప్రజల ఇళ్లలో వద్దా? ఒక్కరోజు సెలవు తీసుకోకుండా పేదలు, నిరుద్యోగుల కోసం పనిచేస్తున్నా. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ సలహాలు ఇవ్వాలి. అదీ చెయ్యడం లేదు. రాష్ట్రంలో 30వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 24లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.10 వేల ప్రైవేటు పాఠశాలలుంటే 34 లక్షల మంది విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పిల్లల్ని పంపించాలంటే తల్లిదండ్రులు నామోషీగా ఫీల్ అవుతున్నారు. ఆ పరిస్థితిని మారుస్తా. ప్రభుత్వ విద్యాసంస్థలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతున్నాం. ఈనెల 11న 25 జిల్లాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్‌కు శంకుస్థాపన చేస్తున్నాం" అని చెప్పారు.
దుర్గమ్మ దర్శనానంతరం సీఎం చంద్రబాబు చెప్పిన మాటలివే
Also Read:
Mandakrishna madiga: హైదరాబాద్‌లో మందకృష్ణ మాదిగ అరెస్ట్.. ఎందుకంటే
హిందువుల మధ్య కాంగ్రెస్ చిచ్చుపెడుతోంది..
For More Telangana News and Telugu News..