Share News

TG News: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి..

ABN , Publish Date - Jul 29 , 2024 | 11:16 AM

తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Varma)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం 9గంటల సమయంలో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను శాలువాతో సన్మానించారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

TG News: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి..

హైదరాబాద్: తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Varma)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం 9గంటల సమయంలో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను శాలువాతో సన్మానించారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఇటీవల తెలంగాణ గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించిన సంగతి తెలిసిందే. నూతన గవర్నర్ వచ్చిన సందర్భంగా రేవంత్ రెడ్డి ఆయణ్ను కలిశారు. రాష్ట్ర ప్రజల తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు సీఎం వెళ్లారు.


ఈనెల 31న రాజ్ భవన్‌లో జిష్ణుదేవ్ వర్మను గవర్నర్‌గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. గతంలో జిష్ణుదేవ్ వర్మ త్రిపుర ఉపముఖ్యమంత్రిగా పని చేశారు. ఈయన త్రిపుర రాజకుటుంబానికి చెందిన వ్యక్తి కాగా..1990లో రామజన్మభూమి ఉద్యమానికి ఆకర్షితులపై బీజేపీలో చేరారు. తెలంగాణ ఇన్‌ఛార్జ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ కావడంతో ఆయన ఇవాళ రిలీవ్ కానున్నారు.


శాసనసభ సమావేశాల అనంతరం రాధాకృష్ణన్‌కు వీడ్కోలు పలికేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు రాజ్ భవన్‌కు వెళ్లనున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల సందర్భంగా రాధాకృష్ణన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం మెుత్తం పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని మహంకాళి, ఎల్లమ్మతల్లిని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Updated Date - Jul 29 , 2024 | 11:29 AM