Share News

CM Revanth: హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్ కార్మికుల ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Jul 26 , 2024 | 10:01 PM

హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్ కార్మికుల ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్‌‌రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్(TGCO)పై సీఎం శుక్రవారం నాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స‌చివాల‌యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

CM Revanth: హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్ కార్మికుల ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలి
CM Revanth Reddy

హైదరాబాద్: హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్ కార్మికుల ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్‌‌రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్(TGCO)పై సీఎం శుక్రవారం నాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స‌చివాల‌యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టీజీసీఓ ఎండీ శైలజ రామయ్యర్, సంబంధిత శాఖ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.


ఆగస్టు 15 తర్వాత యూనిఫాం ప్రొక్యూర్ చేసే వారితో సమావేశం నిర్వహించే ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌ తెలిపారు. ఆర్టీసీ, పోలీస్, హెల్త్ విభాగాల్లో ప్రభుత్వ సంస్థల నుంచే క్లాత్ ప్రొక్యూర్ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. తద్వారా కార్మికులకు మరింత ఉపాధి కలుగుతుందని సీఎం వివరించారు. మహిళా శక్తి గ్రూప్ సభ్యులకు బెస్ట్ క్వాలిటీతో డ్రెస్ కోడ్ కోసం.. ప్రత్యేక డిజైన్ రూపొందించే అంశాన్ని పరిశీలించాలని అన్నారు. నిజమైన కార్మికుడికి లబ్ధి చేకూర్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.


పంచాయతీ ఎన్నికలపై చర్చ..

మరోవైపు.. తెలంగాణ‌లో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు త్వరలోనే న‌గారా మోగ‌నుంది. మరికొన్ని రోజుల్లోనే ఎన్నిక‌ల షెడ్యూల్‌ను విడుద‌ల చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముహుర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కొత్త ఓటరు జాబితాను ఆగస్టు మొదటి వారంలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సూచించారు. పంచాయితీ రాజ్ ఎన్నికలు , కార్యాచరణపై శుక్రవారం నాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స‌చివాల‌యంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో పంచాయతీ ఎన్నికలు జరపాలని నిర్ణయించారు.


అలాగే.. తెలంగాణలో మళ్లీ లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మీడియాకు ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. శుక్రవారం నాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స‌చివాల‌యంలో విధివిధానాలు ఖరారు కోసం మంత్రులు మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఇత‌ర ఉన్నతాధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వహించారు. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకోవాలని అధికారులకు సూచించారు.


Also Read:

లోకేశ్ గ్రీన్ సిగ్నల్.. టీడీపీలోకి ఎమ్మెల్సీ!

వికసిత్ భారత్-2047 లక్ష్యం దిశగా..

వీడు పిల్లాడా.. లేక సర్కస్ ట్రైనరా.. ఎగ్జిబిషన్‌లో ...

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 26 , 2024 | 10:58 PM