Share News

Bhatti Vikramarka: ఎమ్మెల్యే చేరికపై డిప్యూటీ సీఎం స్పందన

ABN , Publish Date - Jun 28 , 2024 | 01:19 PM

న్యూఢిల్లీ: సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించిన అంశాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర ద్వారా ఐక్యతను చాటి చెప్పిన రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రతిపక్ష నేతగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించినట్లు చెప్పారు.

Bhatti Vikramarka: ఎమ్మెల్యే చేరికపై డిప్యూటీ సీఎం స్పందన

న్యూఢిల్లీ: సీడబ్ల్యూసీ సమావేశం (CWC meeting)లో చర్చించిన అంశాలపై డిప్యూటీ సీఎం (Deputy CM) భట్టి విక్రమార్క (Bhatti Vikarmarka) స్పందించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఢిల్లీ (Delhi)లో మీడియాతో మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ద్వారా ఐక్యతను చాటి చెప్పిన రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్ సభ (Lok Sabha)లో ప్రతిపక్ష నేతగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రతిపాదించినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై మంత్రి మండలి కూర్పు, ఆర్గనైజేషన్ గురించి చర్చించామన్నారు. బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) పార్టీలు తమ ప్రభుత్వంపై కుట్రలు, కుతంత్రాలు చేస్తూ.. కూల్చివేస్తామని ప్రకటిస్తున్నాయన్నారు. మరోవైపు కాంగ్రెస్‌లో చేరికల అంశంపై కూడా చర్చించామన్నారు.


కాగా పీవీ నరసింహారావు జయంతి (PV Narasimha Rao Jayanti) సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీవీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆర్ధిక పరమైన సంస్కరణలు తెచ్చి ప్రపంచ పోటీలో భారతదేశాన్ని నిలిపారన్నారు. భారతదేశ పాలనలో తెలుగువారి ముద్రవేసి గర్వపడేలా చేశారని, పీవీ భవిష్యత్ తరాల పాలనకు పునాదులు వేసారన్నారు. రాష్ట్రప్రభుత్వం పీవీ మార్గాన్ని అవలంబిస్తోందని, ఆయన ఆలోచనలు ముందుకు తీసుకు వెళుతుందని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.


మరోవైపు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదో రోజు శుక్రవాం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించారు. ఇవాళ మరోసారి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,శ్రీధర్ బాబు సమావేశం కానున్నారు. మంత్రివర్గం విస్తరణ, టీపీసీసీ నియామకం, ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకునే అంశం, పార్టీలోని తాజా రాజకీయ పరిణామాలపై అధిష్టానం పెద్దలతో చర్చలు జరపనున్నారు. కాగా నిన్న (గురువారం) అర్ధరాత్రి వరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు చర్చించారు. పూర్వ నిజామాబాద్, అదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతలకు మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదు..

రామోజీరావు సంస్మరణ సభ దృశ్యాలు..

జగన్ సర్కర్ చెప్పిందే.. కలెక్టర్లు పాటించారు..

ఓటమితో వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 28 , 2024 | 01:29 PM