Share News

TG Politics: కేసీఆర్‌పై అసత్య కథనాలు.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బాల్కసుమన్ ఫిర్యాదు

ABN , Publish Date - May 31 , 2024 | 05:36 PM

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (KCR) దుష్ప్రచారం చేస్తూ ప్రసారం చేసిన ఓ వార్త ఛానల్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balkasuman) శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

TG Politics: కేసీఆర్‌పై అసత్య కథనాలు.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బాల్కసుమన్  ఫిర్యాదు

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (KCR) దుష్ప్రచారం చేస్తూ ప్రసారం చేసిన ఓ వార్త ఛానల్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balkasuman) శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇటీవల లిక్కర్ స్కాంకు సంబంధించిన వార్తలు ప్రచారం చేస్తూ కేసీఆర్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా పలు ఛానల్స్ కథనాలను ప్రసారం చేశాయని అన్నారు. మీడియా ఎలాంటి నిర్ధారణ లేకుండా గొప్ప నాయకుడిపై అసత్యాలతో కూడిన వార్త కథనాలను ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఇకనైనా మీడియా నిర్ధారణ చేసుకొని వార్త కథనాలు ప్రసారం చేయాలని బాల్క సుమన్ విజ్ఞప్తి చేశారు.


కాగా.. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో తొలిసారి మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ పేరు వెలుగులోకి వచ్చింది. కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులు, పార్టీలో ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకే తామంతా కలిసి పనిచేశామని టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ (ఓఎస్డీ) రాధాకిషన్‌రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు.



ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మంత్రులకు జూన్ ఫోర్త్ ఫీవర్..

చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు టీడీపీ ట్రైనింగ్..

ఆ మంత్రులకు జూన్ ఫోర్త్ ఫీవర్..

రాష్ట్ర చిహ్నం.. తాత్కాలికంగా నిలిపివేత..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 31 , 2024 | 05:48 PM