Share News

TG High Court: రుణమాఫీపై హైకోర్టు న్యాయవాదుల సంబురాలు

ABN , Publish Date - Jul 19 , 2024 | 05:13 PM

తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) రుణమాఫీ(Runa Maffi) పథకానికి గురువారం శ్రీకారం చుట్టింది. రెండు లక్షల లోపు బ్యాంకు రుణాలున్న రైతులకు ఏక మొత్తంలో మాఫీ చేస్తామన్న ప్రభుత్వం తన మాటను నిలబెట్టుకుంది.

TG  High Court: రుణమాఫీపై హైకోర్టు న్యాయవాదుల సంబురాలు
Telangana Raitu RunaMafi

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) రుణమాఫీ(Runa Maffi) పథకానికి నిన్న (గురువారం) శ్రీకారం చుట్టింది. రూ.2 లక్షల లోపు బ్యాంకు రుణాలున్న రైతులకు ఏక మొత్తంలో మాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తన మాటను నిలబెట్టుకున్నారు. అనుకున్న దానికంటే ముందే మొదటి విడత రుణమాఫీ నగదును ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఎన్నికల హామీలో భాగంగా రైతులకు రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీలకు బషీర్‌బాగ్ చౌరస్తాలో హైకోర్టు న్యాయవాదులు క్షీరాభిషేకాలు చేశారు.

1cm-3.jpg


ALSO Read: Crop Loan Waiver: రైతులకు బిగ్ అలర్ట్.. ఈ తప్పు అస్సలు చేయకండి..

వెంకటేష్ ఇంద్రపల్లి ఆధ్వర్యంలో సీఎం ఫొటోకి క్షీరాభిషేకం..

కాంగ్రెస్‌ పార్టీ (Congress Party) ఎన్నికల హామీలో భాగంగా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ నగదు జమ చేయడంతో సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ హైకోర్టు (Telangana High Court) అడ్వకేట్ జేఏసీ కోఆర్డినేటర్ వెంకటేష్ ఇంద్రపల్లి ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ చేస్తున్నందుకుగాను సీఎం రేవంత్ రెడ్డికి, హైకోర్టు అడ్వకేట్లు, సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు కలిసి రేవంత్ ఫొటోకి పాలాభిషేకం చేశారు. ఇది ప్రజల ప్రభుత్వం, రైతు ప్రభుత్వం అంటూ రేవంత్ రెడ్డికి న్యాయవాదులు జేజేలు కొడుతూ కొనియాడారు.


ALSO Read: YS Sharmila: తెలంగాణ ప్రభుత్వంపై షర్మిల ప్రశంసలు

అయితే.. రూ.2 లక్షల లోపు బ్యాంకు రుణాలున్న రైతులకు ఏక మొత్తంలో మాఫీ చేస్తామన్న ప్రభుత్వం తన మాటను నిలబెట్టుకుంది. అనుకున్న దానికంటే ముందే మొదటి విడుత రుణమాఫీ నగదును గురువారం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ రైతులకు రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9వ తేదీ మధ్య కాలంలో తీసుకున్న రుణాల మాఫీకి రేవంత్‌ సర్కారు కట్టుబడింది. ఆగస్టు 15వ తేదీలోపు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్న ఇప్పటికే ప్రకటించగా, ఆ దిశగా మొదటి అడుగు వేసింది. సర్కారు చొరవతో రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది.


ఈ వార్తలు కూడా చదవండి

Minister Ponguleti: కేసీఆర్ సర్కార్‌లో ఆర్థిక విధ్వంసం

IMD: ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. కమ్ముకొస్తున్న మబ్బులు

Raj Tarun-Malvi Malhotra: హీరో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా మెసేజ్ చాట్స్ లీక్.. లవ్ ప్రపోజ్ చేసిన..

Group-2 Exams: గ్రూపు-2 పరీక్షలు వాయిదా!?

Read More Telangana News and Telugu News

Updated Date - Jul 19 , 2024 | 05:43 PM