Share News

Kodandaram: కాంట్రాక్టు లెక్చరర్లును వెంటనే క్రమబద్ధీకరణ చేయాలి

ABN , Publish Date - Sep 01 , 2024 | 09:00 PM

సమస్యలపై ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉంటానని ఎమ్మెల్సీ, తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.

 Kodandaram: కాంట్రాక్టు లెక్చరర్లును వెంటనే క్రమబద్ధీకరణ చేయాలి
Kodandaram

హైదరాబాద్: సమస్యలపై ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉంటానని ఎమ్మెల్సీ, తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‎లో ఆత్మీయ సత్కార సభ జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు కనక చంద్రన్ అధ్యక్షతన టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు జగదీష్, ప్రధాన కార్యదర్శి ముజీబ్, టీజీఓ అధ్యక్షుడు శ్రీనివాస్‎లు... ప్రొఫెసర్ కోదండరామ్‎ను ఘనంగా సన్మానించారు.


ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ... జీతాలు పెంచాలని... ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని అనేక పోరాటాలు చేసిన జూనియర్ లెక్చరర్స్‎కు సుప్రీంకోర్టు తీర్పు చాలా ఉపయోగపడిందని కోదండరామ్ అన్నారు. ఒకే రకం ఉద్యోగులకు ఒకే రకం వేతనం ఇవ్వాలన్న డిమాండ్ న్యాయమైందని తెలిపారు. తనకు కేటాయించిన ఎమ్మెల్సీ పదవి బాధ్యతగా భావిస్తానని... చిక్కులు, బాధలు, సమస్యలు ఉంటాయని వాటి అన్నింటినీ అధిగమించి పని చేస్తానని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహదినమని.. మద్దతు ప్రకటిస్తున్నానని కోదండరామ్ అన్నారు.


క్రమబద్ధీకరణ కాని కాంట్రాక్టు లెక్చరర్లును వెంటనే క్రమ బద్ధీకరణ చేయాలని... ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని.. 317 జీ.ఓను రద్దు చేసి స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని... అసోసియేషన్ అధ్యక్షుడు కనక చంద్రం ఆచార్య కోదండరామ్ దృష్టికి తీసుకెళ్లారు.


అలాగే సుదీర్ఘకాలంగా ఒకే కళాశాలలో పని చేస్తున్న ఆధ్యాపకులను ప్రత్యేక జీవో ద్వారా బదిలీలు చేపట్టాలని చెప్పారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రోజువారి వ్యయనిర్వహణ నిధులు పెంచాలని కోరారు. అన్ని డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిస్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని కోదండరామ్ లెక్చరర్లకు హామీ ఇచ్చారు.

Updated Date - Sep 01 , 2024 | 09:49 PM