Share News

MP Etela: ప్రియ ఎన్‌క్లేవ్‌లో ఇళ్ల కూల్చివేతపై ఎంపీ ఈటెల ఫైర్..

ABN , Publish Date - Jul 08 , 2024 | 05:43 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి డబ్బులు దండుకోవటం తప్ప పాలనపై ధ్యాస లేదని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ (MP Etela Rajender) ఆగ్రహం వ్యక్తం చేశారు. పీర్జాదిగూడ(Peerzadiguda ) పరిధిలోని ప్రియ ఎన్ క్లేవ్‌లో పేదల ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిందంటూ ఈటెల తీవ్రంగా స్పందించారు.

MP Etela: ప్రియ ఎన్‌క్లేవ్‌లో ఇళ్ల కూల్చివేతపై ఎంపీ ఈటెల ఫైర్..

మల్కాజ్‌గిరి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి డబ్బులు దండుకోవటం తప్ప పాలనపై ధ్యాస లేదని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ (MP Etela Rajender) ఆగ్రహం వ్యక్తం చేశారు. పీర్జాదిగూడ(Peerzadiguda) పరిధిలోని ప్రియ ఎన్ క్లేవ్‌లో పేదల ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిందంటూ ఈటెల తీవ్రంగా స్పందించారు. అన్ని అనుమతులతో ఇళ్లు నిర్మించుకున్నా కూల్చివేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇలాంటి నియంతృత్వ పోకడలకు పోయే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రెవెన్యూ మంత్రికి తెలియకుండానే అధికారులు ఇళ్లు కూల్చివేస్తున్నారా అంటూ ప్రశ్నించారు.


ప్రియ ఎన్ క్లేవ్‌లో ఇళ్లు నిర్మించుకున్న వారంతా చిన్నచిన్న ఉద్యోగులు, చిరువ్యాపారులు, పేదలే అని ఈటెల తెలిపారు. ఒకవేళ ఇవి అక్రమ భూములే అయితే జీహెచ్ఎంసీ అధికారులు గతంలో ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. దీని వెనక రాజకీయకుట్ర దాగి ఉందని ఈటెల ఆరోపించారు. ఇళ్లు నిర్మించుకున్న స్థలం ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రామ్ దాస్ గౌడ్ నుంచే బాధితులంతా కొనుగోలు చేశారని, పోచయ్య అనే కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలో చేరకపోవడంతోనే వివాదానికి తెరతీశారని ఆరోపించారు. భయపెట్టి పార్టీలో చేర్చుకోవడం లేదంటే కేసులు పెట్టి జైళ్లకు పంపాలని చూసిన గత బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో గుర్తు చేసుకోవాలన్నారు.


ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ వ్యవస్థలే వారిని హింసించే దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోందన్నారు. బీఆర్ఎస్ హయాంలోనూ ఇలాంటి పరిస్థితి ఉండేదని, ఇప్పుడూ అలానే కనిపిస్తోందన్నారు. రెండు ప్రభుత్వాలకూ పెద్దగా తేడా ఏం లేదని ఎంపీ ఈటెల అన్నారు. 30, 40సంవత్సరాల కిందట కొనుగోలు చేసిన భూముల విషయంలో ఇప్పుడు రాద్ధాంతం చేయడంపై సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో 300మంది రోడ్డున పడ్డారని రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు ఉన్నా సరే పేదల ఇళ్లు కూల్చిన ఎమ్మార్వో, ఆర్డీవోపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. గతంలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు పెట్టాలని ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు.


రాష్ట్రంలో గంజాయి, సారా, మత్తుపదార్థాలు అరికట్టలేని కాంగ్రెస్ ప్రభుత్వం 200మంది పోలీసులతో ఇళ్లు కూల్చివేశారంటూ దుయ్యబట్టారు. కేసీఆర్‌ను ఓడించాలని మాత్రమే ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారని చురకలు అంటించారు. కేసీఆర్ లాగానే రేవంత్ రెడ్డికి కూడా కళ్లు నెత్తికి ఎక్కాయని ధ్వజమెత్తారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురి మంత్రులకు ఫోన్ చేసినా స్పందించ లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో అన్యాయం జరిగిందనే ప్రజలు, ఉద్యమకారులు, మేధావులు కాంగ్రెస్‌ను గెలిపిస్తే వీరు అంతకు మించి చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ దుర్మార్గాలను బీజేపీ నేతలు చూస్తూ ఉరుకోరని, ఇలాంటి చర్యలు పునరావృతం అయితే తగిన గుణపాఠం చెప్తామని ఎంపీ ఈటెల రాజేందర్ హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

Liquor case: ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో విచారణ శుక్రవారానికి వాయిదా..

Balkampet Yellamma Talli: మెుదలైన బల్కంపేట్ ఎల్లమ్మతల్లి కల్యాణ ఉత్సవం..

Updated Date - Jul 08 , 2024 | 05:43 PM