Share News

Laxman: దేశ ప్రజలను అవమానించేలా అమెరికాలో రాహుల్ వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 11 , 2024 | 04:55 PM

Telangana: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల హ్యాంగోవర్ నుంచి బయటపడ్డట్టు లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా పర్యటనలో దేశం, ప్రజాస్వామ్యం పట్ల భారత దేశప్రజలను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ, బీజేపీ వల్ల ప్రధాని కాలేదనే అక్కసుతో దేశం మీద విషం చిమ్ముతున్నారన్నారు.

Laxman: దేశ ప్రజలను అవమానించేలా అమెరికాలో రాహుల్ వ్యాఖ్యలు
BJP MP Laxman

హైదరాబాద్, సెప్టెంబర్ 11: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎన్నికల హ్యాంగోవర్ నుంచి బయటపడ్డట్టు లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ అమెరికా పర్యటనలో దేశం, ప్రజాస్వామ్యం పట్ల భారత దేశ ప్రజలను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ, బీజేపీ వల్ల ప్రధాని కాలేదనే అక్కసుతో దేశం మీద విషం చిమ్ముతున్నారన్నారు. కాంగ్రెస్ ఓడిపోయినంత మాత్రాన ప్రజాస్వామ్యం లేదని ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశ.. జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన కోర్టు


బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఫేక్ వీడియోలు సృష్టించి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ లబ్ధి పొందిందన్నారు. రిజర్వేషన్ల రద్దుకు రాహుల్ గాంధీ తెరలేపుతున్నారన్నారు. రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు కల్పించిన అంబేద్కర్‌ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ ది అని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు హోదాలో సమయం అనుకూలించినప్పుడు రద్దు చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వం నచ్చే బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. భారతదేశాన్ని వ్యతిరేకించే శక్తులతో రాహుల్ గాంధీ సమావేశం అవుతున్నారన్నారు. రాహుల్ గాంధీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సిక్కుల ఊచకోతకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ అని.. సిక్కుల హక్కుల కోసం రాహుల్ గాంధీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎంపీ లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Viral Video: పెళ్లిలో ఫొటోలు తీస్తుండగా షాకింగ్ సీన్.. వధువు తలపై ముద్దు పెట్టమంటే.. వరుడి వింత నిర్వాకం.. చివరకు..



అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ కూడా విరుచుకుపడ్డారు. రాహుల్.... క్విట్ ఇండియా అంటూ వ్యాఖ్యలు చేశారు. విదేశాలకు వెళ్లి భారత ఎన్నికల వ్యవస్థను విమర్శిస్తావా? అంటూ మండిపడ్డారు. రిజర్వేషన్లపై నోటికొచ్చినట్లు మాట్లాడతావా అంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

Bandi Sanjay: అంకుశం సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతే కేసీఆర్‌కు పట్టేది..

Raja singh: నిమజ్జనం వేళ అలా చేస్తే చర్యలు తీసుకోవాల్సిందే

Read LatestTelangana NewsAndTelugu News

Updated Date - Sep 11 , 2024 | 05:00 PM