Congress: ఫిరాయింపులపై బీఆర్ఎస్ మాట్లాడుతుంటే నవ్వు వస్తోంది: షబ్బీర్ అలీ
ABN , Publish Date - Jun 24 , 2024 | 01:51 PM
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే నవ్వు వస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియతో మాట్లాడుతూ.. భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) మాట్లాడుతుంటే నవ్వు వస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత (Congress Senior Leader), ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో (Gandhi Bhavan) మీడియతో మాట్లాడుతూ.. భట్టి విక్రమార్కకు (Bhatti Vikramarka) ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసింది కేసీఆర్ (KCR) కాదా? అని ప్రశ్నించారు. శాసనమండలిలో (Legislative Council) కూడా తన ప్రతిపక్ష నేత హోదా తొలగించలేదా? అని నిలదీశారు. తమ పార్టీ ఎమ్మేల్యే, ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ (BRS)లో చేర్చుకోలేదా? అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లలో డిపాజిట్ పోయిందని, ఇప్పుడు అనర్హత వేటు గురించి మట్లాడుతున్నారని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ పార్టీ ఖతం అయ్యిందని, 11 ఎకరాలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం ఎందుకు?.. ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని షబ్బీర్ అలీ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు ఆఫీస్ లేదని, కొకపేటలో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోవాలని సూచించారు. ఆ భూమి వేలం వేసి ఆ డబ్బులు రుణమాఫీకి ఉపయోగించాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్న ఆఫీస్ ఎక్కువని.. దానికి కూడా తామే భూమి ఇచ్చామని గుర్తు చేశారు. తెలంగాణని కేసీఆర్ అంగడి బజారులో పెట్టారని, తెలంగాణని అమ్మకానికి పెట్టారంటూ కేసీఆర్‌పై షబ్బీర్ అలీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పులివెందులలో ముగిసిన జగన్ పర్యటన..
45 రోజులపాటు.. 26 రైళ్ళ రద్దు..
చైన్ స్నాచర్లపై పోలీసుల ఉక్కు పాదం..
రెండు శాఖల్లో త్వరలో కొత్త పాలసీని తీసుకొస్తాం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News