Share News

Sharwanand: మా ఆవిడ కోసమే కాఫీ తాగుతున్నాను: సినీ హీరో శర్వానంద్

ABN , Publish Date - Jun 18 , 2024 | 10:27 PM

కాఫీ, టీ అలవాటు తనకు లేదని కానీ పెళ్లి అయ్యాక మా ఆవిడకు కాఫీ అంటే చాలా ఇష్టమని.. ఆమె కోసం తాను కూడా కాఫీ తాగుతున్నానని సినీ హీరో శర్వానంద్ (Sharwanand) పేర్కొన్నారు.

Sharwanand: మా ఆవిడ కోసమే కాఫీ తాగుతున్నాను: సినీ హీరో శర్వానంద్

హైదరాబాద్: కాఫీ, టీ అలవాటు తనకు లేదని కానీ పెళ్లి అయ్యాక మా ఆవిడకు కాఫీ అంటే చాలా ఇష్టమని.. ఆమె కోసం తాను కూడా కాఫీ తాగుతున్నానని సినీ హీరో శర్వానంద్ (Sharwanand) పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 44లో శర్వానంద్‌ సోదరుడు ఏర్పాటు చేసిన బీన్జ్‌ కాఫీ స్టోర్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహ, ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, హీరో శర్వానంద్‌లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన విభిన్న రుచులను మంత్రులు రుచి చూశారు.


హీరో శర్వానంద్‌ మాట్లాడుతూ.. తనకు బీన్జ్‌ రెస్టారెంట్‌తో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని, అప్పట్లో తన కాఫీ షాప్‌లో సినీ హీరోలు రామ్‌చరణ్, బన్నీ, అఖిల్‌తోపాటు మరికొంత మంది హీరోలంతా కలిసి సరదాగా గడిపేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. తమ స్నేహితులు ఎప్పుడు కలిసినా కాఫీ షాప్‌లోనే కలిసేవారిమని చెప్పారు. నిర్వాహకులు అర్జున్‌ మైనేని మాట్లాడుతూ.. విభిన్న రుచులతోపాటు కాంటినెంటల్‌ రెసిపీలను నగరవాసులకు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ డాక్టర్‌ మంజుల అనగాని, డి. వంశీకృష్ణంరాజు, ప్రశాంత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2024 | 10:27 PM