Share News

Revanth Reddy: తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలి: రేవంత్

ABN , Publish Date - May 22 , 2024 | 10:44 AM

CM Revanth Reddy in Tirumala: తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని(Lord Venkateswara Swamy) ప్రార్థించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చెప్పారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Revanth Reddy: తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలి: రేవంత్
Telangana CM Revanth Reddy

CM Revanth Reddy in Tirumala: తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని(Lord Venkateswara Swamy) ప్రార్థించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చెప్పారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి భార్య, కూతురు, మనవడు, అల్లుడితో కలిసి శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వైకుంఠ ద్వారం గుండా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు రేవంత్ రెడ్డి. అంతకంటే ముందు ఉదయం తన మనవడి పుట్టెంటుకలను స్వామి వారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు రేవంత్.


CM-Revanth-Reddy-2.jpg

మంచి సంబంధాలు ఉండాలి..

శ్రీవారి దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంతో మంచి సత్సంబంధాలు కలగి ఉండాలని ఆకాంక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించానని రేవంత్ చెప్పారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తమ వంతు సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సైతం సహకరిస్తుందని ప్రకటించారు. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. సకాలంలో వర్షాలు కురవడంతో నీటి సమస్యలు తీరాయన్నారు. స్వామివారి ఆశీస్సులతో తెలంగాణతో పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని కోరుకున్నానని సీఎం రేవంత్ చెప్పారు.


హైదరాబాద్ తిరుగుపయనం..

తిరుమల వెంకన్నను దర్శించుకున్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తిరుగుపయనం అయ్యారు. తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరారు. రేణిగుంట నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరుతారు రేవంత్, ఆయన కుటుంబ సభ్యులు.

For More Telangana News and Telugu News..

Updated Date - May 22 , 2024 | 10:47 AM