Share News

T.High Court: అమిత్‌ షా వీడియో మార్ఫింగ్ కేసులో హైకోర్టుకు టీపీసీసీ

ABN , Publish Date - May 09 , 2024 | 12:32 PM

Telangana: కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసుకు సంబంధించి టీపీసీసీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. అమిత్ షా వీడియో మార్కింగ్ కేసులో ఢిల్లీ పోలీసుల వేధింపులపై కోర్టు దృష్టికి టీపీసీసీ తీసుకెళ్లింది. ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెందిన 29 మంది సెక్రటరీల నివాసాలకు ఢిల్లీ పోలీసులు వెళ్లారు.

T.High Court: అమిత్‌ షా వీడియో మార్ఫింగ్ కేసులో హైకోర్టుకు టీపీసీసీ
TPCC Approached Telangana High Court

హైదరాబాద్, మే 9: కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) వీడియో మార్ఫింగ్ కేసుకు (Video Marphing Case) సంబంధించి తెలంగాణ హైకోర్టును (Telangana High Court) టీపీసీసీ(TPCC) ఆశ్రయించింది. అమిత్ షా వీడియో మార్కింగ్ కేసులో ఢిల్లీ పోలీసుల (Delhi Police) వేధింపులపై కోర్టు దృష్టికి టీపీసీసీ తీసుకెళ్లింది. ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెందిన 29 మంది సెక్రటరీల నివాసాలకు ఢిల్లీ పోలీసులు వెళ్లారు. ఢిల్లీ పోలీసుల చర్యపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Working President Mukesh Goud) హైకోర్టును ఆశ్రయించారు. రాత్రి వేళలో కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి దాడులు చేస్తున్నారని పిటిషన్ దాఖలు చేశారు.

Viral Video: అయోధ్య రాముడిని దర్శించుకున్న గవర్నర్ మహ్మద్ ఖాన్.. సాష్టాంగ నమస్కారం చేసి పూజలు


మే 4న మండసాయి ప్రతాప్ ఇంటిపై తెల్లవారుజామున ఢిల్లీ పోలీసులు రైడ్ చేశారని.. కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలకు చెందిన మొబైల్ ఫోన్లు తీసుకెళ్లారని పిటిషన్‌లో తెలిపారు. పాస్వర్డ్ చెప్పాలని బలవంతంగా వేధిస్తున్నట్లు టీపీసీసీ పిటిషన్‌‌లో పేర్కొంది. ఢిల్లీ పోలీసుల చర్యలపై రాష్ట్ర డీజీపీకి కూడా ఢిల్లీ పోలీసులు సమాచారం ఇవ్వని పరిస్థితి. ఢిల్లీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ టీపీసీసీ పిటిషన్ దాఖలు చేసింది.

AP Elections 2024: వైసీపీ కార్యకర్తలు యధేచ్చగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన


కాగా.. అమిత్‌ షా ఫేక్ వీడియో కేసులో ఐదుగురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. టీపీసీసీ సోషల్ మీడియా టీమ్ మెంబర్స్ పెండ్యాల వంశీకృష్ణ, మన్నె సతీష్, నవీన్, ఆస్మా తస్లీమ్, గీతలను అరెస్ట్‌ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా.. వారికి కోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నిందితులు ప్రతీ సోమ, శుక్ర వారాలు కేసు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్న ఐదుగురిని అరెస్ట్ చేయాలని ఢిల్లీ పోలీసులు చూస్తున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

Loksabha polls: అర్ధరాత్రి వచ్చి డబ్బులిస్తారు.. డబ్బు తీసుకోండి కానీ ఓటు మాత్రం..: రేణుకా చౌదరి

Lok Sabha Polls: రిజర్వేషన్లపై రాద్దాంతం.. రాజ్యంగం ఏం చెబుతోంది..

Read latest Telangana News And Telugu News

Updated Date - May 09 , 2024 | 12:35 PM