Share News

TG News: దేశంలోనే తొలిసారిగా ఎల్‌బీనగర్ మెట్రోస్టేషన్‌లో ఆరోగ్య కేంద్రాలు ప్రారంభం

ABN , Publish Date - Sep 15 , 2024 | 04:12 PM

. మిట్టా ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో ఈరోజు (ఆదివారం) ఎల్‌బీనగర్ మెట్రో స్టేషన్‌లో పాలీ హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మెట్రో ప్రయాణికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. తొలిసారిగా హెల్త్ ఏటీఎం కూడా అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. రక్త పరీక్షల డయాగ్నస్టిక్ సౌకర్యం, మెడికల్ షాప్, వైద్య నిపుణులు, ఫిజియోథెరపీ, టెలీమెడిసిన్, డెంటల్ కేర్ ఇలా అన్నీ సౌకర్యాలు మెట్రో స్టేషన్‌లో ఉంటాయని వెల్లడించారు.

TG News: దేశంలోనే తొలిసారిగా ఎల్‌బీనగర్ మెట్రోస్టేషన్‌లో ఆరోగ్య కేంద్రాలు  ప్రారంభం

హైదరాబాద్: దేశంలోనే మొట్టమొదటి సారిగా హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లలో ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావడం గర్వకారణమని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. మిట్టా ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో ఈరోజు (ఆదివారం) ఎల్‌బీనగర్ మెట్రో స్టేషన్‌లో పాలీ హెల్త్ క్లినిక్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హాజరయ్యారు. ఎల్‌బీనగర్ వరకు మెట్రో రైల్లో ప్రయాణించిన ఆమె.. ఆ స్టేషన్‌లో లాంఛనంగా ఆరోగ్య సేవలను ప్రారంభించారు.


ALSO READ: CM Revanth: సీఎం రేవంత్ ఇంటి వద్ద బ్యాగ్ కలకలం

ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ... మెట్రో ప్రయాణికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఈ వైద్య సేవలను వినియోగించుకోవచ్చని సూచించారు. తొలిసారిగా హెల్త్ ఏటీఎం కూడా అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. రక్త పరీక్షలు, డయాగ్నస్టిక్ సౌకర్యం, మెడికల్ షాప్, వైద్య నిపుణులు, ఫిజియోథెరపీ, టెలీమెడిసిన్, డెంటల్ కేర్ ఇలా అన్నీ సౌకర్యాలు మెట్రో స్టేషన్‌లో ఉంటాయన్నారు. ఆధునిక కార్పొరేట్ స్థాయి వైద్యం మెట్రో స్టేషన్‌‌లలో అందుబాటులోకి రావడం దేశంలోనే రికార్డు అని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వివరించారు.


ALSO READ: Serilingampally MLA: అరెకపూడి గాంధీ నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు

ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ... లక్షలాది మంది ప్రయాణించే మెట్రో ట్రైన్లలో ఎలాంటి అనారోగ్యానికి గురైనా వెంటనే ఎమర్జెన్సీ క్లినిక్స్ ఆయా మెట్రోస్టేషన్లలో అందుబాటులోకి తీసుకు రావడం గొప్ప విషయమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు చూపు ఆదర్శనీయమని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు.


ALSO READ: BRSV: మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్‌ఎస్‌వీ యత్నం

మిట్టా ఎక్స్ లెన్స్ చైర్మన్ డా. మిట్టా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎల్‌బీనగర్‌లో తొలి క్లినిక్ ప్రారంభించామని, త్వరలో మియాపూర్, రాయదుర్గం మెట్రో స్టేషన్లలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వంద మెట్రో కేంద్రాల్లో ఆరోగ్య సేవలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన ‘ఎనీమియా ముక్త భారత్’ పిలుపులో భాగంగా తాము ఉచితంగా హిమోగ్లోబిన్ పరీక్షలు చేయనున్నట్లు ప్రకటించారు.


అలాగే విజన్ చెక్, ఆడియోమెట్రీ లాంటి 21 టెస్టులు ఉచితంగా చేయనున్నట్లు మిట్టా శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మిట్టా ఎక్స్ లెన్స్ డైరెక్టర్లు డాక్టర్ నిఖిల్, సీనియర్ జర్నలిస్ట్ డా. మహ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Serilingampally MLA: అరెకపూడి గాంధీ నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు

MP Etala: అన్ని రాష్ట్రాలు సమగ్ర కులగణన చేపట్టాలి..

TPCC: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరణ..

For MoreTelangana NewsandTelugu News.

Updated Date - Sep 15 , 2024 | 04:40 PM