Share News

Hanumantha Rao: మాట నిలబెట్టుకునే కల్చర్ మాది: మాజీ పీసీసీ వి.హనుమంతరావు

ABN , Publish Date - Jul 19 , 2024 | 05:10 PM

బీఆర్ఎస్, బీజేపీ నేతలు రుణమాఫీపై అసత్య ప్రచారాలు చేసున్నారంటూ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు(V.Hanumantha Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చినప్పుడే ఆ పార్టీ పని ఖతమైందని ఆయన ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కోసం ప్రాజెక్టులు కట్టి, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

Hanumantha Rao: మాట నిలబెట్టుకునే కల్చర్ మాది: మాజీ పీసీసీ వి.హనుమంతరావు
V.Hanumantha Rao

సిద్దిపేట: బీఆర్ఎస్, బీజేపీ నేతలు రుణమాఫీపై అసత్య ప్రచారాలు చేసున్నారంటూ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు(V.Hanumantha Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చినప్పుడే ఆ పార్టీ పని ఖతమైందని ఆయన ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కోసం ప్రాజెక్టులు కట్టి, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఆ ప్రాజెక్టులు అన్నీ ఇప్పుడు నేలలోకి కూరుకుపోతున్నాయని, వాటి పరిస్థితి ఎలా ఉందో తెలంగాణ ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన సిద్ధిపేటలో మీడియా సమావేశం నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రగతి భవన్, సెక్రటేరియట్‌కు ఎవ్వరినీ రానిచ్చేవారు కాదని, కాంగ్రెస్ హయాంలో దీన్ని మార్చి ప్రజాపాలన తీసుకొచ్చామని ఆయన చెప్పుకొచ్చారు.


ఈ సందర్భంగా వి.హనుమంతరావు మాట్లాడుతూ.." ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కల్చర్ మాది. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చేసి చూపిస్తున్నాం. తొందరలోనే 6గ్యారంటీలను అమలు చేస్తాం. ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోకపోవడం వల్లే కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదు. కాంగ్రెస్ కార్యకర్తలు మాఫీ కాని అర్హులైన రైతులను గుర్తించి మాఫీ అయ్యేలా చూడాలి. ఆగస్టు 15లోగా అందరికీ రెండు లక్షల రుణాలు మాఫీ చేస్తాం. ఆనాడు యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా ఉన్నప్పుడు రూ.70వేల కోట్లు మాఫీ చేసాం. కేసీఆర్ దళిత సీఎం అని చెప్పి ఎస్సీలను మోసం చేస్తే, మేము బట్టి విక్రమార్కను డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేసి వారి ఆత్మ గౌరవాన్ని పెంచాం. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. మేము 7నెలల్లోనే ఉద్యోగాల భర్తీ మొదలుపెట్టాం. తెలంగాణ రైతులు ప్రతిపక్షాల మోసపూరిత మాటలు నమ్మవద్దు. కేంద్రంలో మోడీ కూడా రెండు కోట్ల ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు. 25కోట్ల మందికి సహాయం చేశానని చెప్పుకుంటున్న మోడీ, ఎవరికి చేశారో బయటపెట్టాలి. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఉక్కు, స్పెషల్ స్టేటస్ కోసం మేము కూడా పోరాడుతాం" అని అన్నారు.

Updated Date - Jul 19 , 2024 | 05:10 PM