Share News

Harish Rao: పేద రైతులకు అన్యాయం జరగకుండా చూడండి...

ABN , Publish Date - Jul 17 , 2024 | 04:31 PM

Telangana: నాలుగు రోజుల క్రితం కొండపాక మండలం దమ్మక్క పల్లి గ్రామంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు బండి కిష్టయ్యను.. మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. భూ తగాదాల విషయంలో గడ్డి మందు సేవించి బలవన్మరణానికి యత్నించడంతో బండి కిష్టయ్యను వెంటనే ములుగు మండలంలోని ఆర్‌వీఎం ఆసుపత్రికి తరలించారు.

Harish Rao: పేద రైతులకు అన్యాయం జరగకుండా చూడండి...
Former Minister Harish Rao

సిద్దిపేట జిల్లా, జూలై 17: నాలుగు రోజుల క్రితం కొండపాక మండలం దమ్మక్కపల్లి గ్రామంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు బండి కిష్టయ్యను.. మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) పరామర్శించారు. భూ తగాదాల విషయంలో గడ్డి మందు సేవించి బలవన్మరణానికి యత్నించడంతో బండి కిష్టయ్యను వెంటనే ములుగు మండలంలోని ఆర్‌వీఎం ఆసుపత్కి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని హరీష్ రావు పరామర్శించి.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు.

YS Sharmila: ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అన్నట్లుగా సీఎం ఢిల్లీ టూర్‌లు


కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా పేద రైతుల భూముల మీద దాడులు చేసి భూములను లాక్కుంటున్న ఘటనలకు రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోయాయన్నారు. న్యాయం చేయండని అడిగిన కొండపాక మండలం దమ్మక్క పల్లి గ్రామానికి చెందిన బండి కిష్టయ్య అనే రైతుపై కేసు పెట్టీ భయ బ్రాంతులకు గురిచేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యం వల్ల, విపరీత చర్యలతో అధికారుల మీద ఒత్తిడి చేయడం వల్ల ఈ ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీనిపై అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారితో విచారణ జరపాలని కోరినట్లు తెలిపారు.

Minister Uttam Kumar: ఈనెల 20న ఢిల్లీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఎందుకంటే..?


ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ సమగ్ర విచారణ జరిపి రైతు ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి దౌర్జన్యాలు ఆపాలన్నారు. పేద రైతులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి రైతు భూమి రైతుకు దక్కేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ,రెవెన్యూ మంత్రి‌కి హరీష్ రావు డిమాండ్ చేశారు. హరీష్‌రావుతో పాటు మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి బాధిత రైతును పరామర్శించారు.


ఇవి కూడా చదవండి...

Dhammika Niroshana: శ్రీలంక మాజీ కెప్టెన్ దారుణ హత్య.. భార్య, పిల్లల ముందే..

Viral Video: మేడపై ఇలాంటి పనులు చేసే సమయంలో జాగ్రత్త.. గుండెల్ని పిండేస్తున్న వీడియో..

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 17 , 2024 | 04:37 PM