Share News

CM Revanth: తెలంగాణ మోడల్‌ను దేశం అనుసరించేలా ఉండాలి

ABN , Publish Date - Jul 17 , 2024 | 04:32 PM

వ్యవసాయ విధానంలో తెలంగాణ మోడల్‌ను దేశం అనుసరించేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. ఈ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలని చెప్పారు. తన జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అని అన్నారు.

CM Revanth: తెలంగాణ మోడల్‌ను దేశం అనుసరించేలా ఉండాలి
CM Revanth Reddy

హైదరాబాద్: వ్యవసాయ విధానంలో తెలంగాణ మోడల్‌ను దేశం అనుసరించేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. ఈ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలని చెప్పారు. తన జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అని అన్నారు. రేపు సాయంత్రం 4గంటలకు రూ.లక్ష వరకు ఉన్న రైతురుణాలు మాఫీ చేస్తున్నామని ప్రకటించారు. రూ.7వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్తాయని అన్నారు. నెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తామని వివరించారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనమేనని తెలిపారు. టీపీసీసీ కార్యవర్గ సమావేశం ఈరోజు (బుధవారం) ప్రజా భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు భట్టివిక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.


రేపు (గురువారం) రుణమాఫీ చేయనున్న నేపథ్యంలో పార్టీ ఆధ్వర్యంలో సంబురాలు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై సీఎం చర్చించారు. పీసీసీ చీఫ్ రేవంత్ అధ్యక్షతన సమావేశం జరిగింది.


ALSO Read: KTR: సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు: కేటీఆర్

ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని చెప్పామని, ముందే రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారని సీఎం రేవంత్ గుర్తుచేశారు. రుణమాఫీ చేస్తామని చెబితే ఇది అసాధ్యమని చాలామంది అన్నారని చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే అన్ని సాధ్యమని నిరూపించామని వివరించారు. రేపు సాయంత్రం రైతుల ఖాతాలో డబ్బులు పడతాయని తెలిపారు. 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ నెరవేర్చారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పితే చట్టమేనని ఉద్ఘాటించారు. సోనియా గాంధీ కుటుంబం గౌరవం కాపాడాలని అన్నారు. దేశానికి ఆదర్శ పాలన మనం ఎందుకు చేయకూడదని చెప్పారు. ఆగస్టు 15వ తేదీ లోపల మరో లక్ష వేస్తామని ప్రకటించారు. వ్యవసాయం దండగ కాదు పండుగ అని వివరించారు. రైతులకు రుణమాఫీ చేయడం తన జీవితంలో మర్చిపోలేనిదని అన్నారు. రేపటి రాజకీయ భవిష్యత్తు రుణమాఫీతో‌ ముడిపడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.


ALSO Read: CM Revanth: కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడి మృతిపై సీఎం రేవంత్ స్పందన

పాస్ పుస్తకం ఉన్న అందరికీ రైతు రుణ మాఫీ అవుతుందని స్పష్టం చేశారు. మాల్యా, నీరవ్ మోదీ లాంటి వారు వేల కోట్ల అప్పుల ఉన్న ఏం చేయలేరని రైతులను మాత్రమే ఇబ్బందులు పెడతారని అన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని చేప్పడానికే రూ. 2 లక్షల రుణ మాఫీని అమలు చేస్తున్నామని వివరించారు. రుణమాఫీపై గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రచారం చేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఓట్లు అడగడానికి గ్రామాలకు వెళ్లామని. ఇప్పుడు రుణ మాఫీ చేశామని గ్రామాల్లో చెప్పాలని అన్నారు.


రుణమాఫీపై జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలని అన్నారు. పార్లమెంటు సభ్యులు రుణమాఫీపై నేషనల్ మీడియాలో చెప్పాలన్నారు. దేశంలో ఇంతవరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పని తెలంగాణ ప్రభుత్వం చేసిందని ఉద్ఘటించారు. రుణమాఫీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ కాదని. ఇది రాహుల్ గాంధీ హామీ అని వివరించారు. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి ఉచిత కరెంట్, ఆరోగ్యం శ్రీ, ఇందిరమ్మ ఇళ్ల గురించి ఇప్పటికే చెప్పుకుంటున్నామని తెలిపారు. రేపు రైతు బంధు గురించి 20 సంవత్సరాలు చెప్పు కోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Harish Rao: ఆ ఎమ్మెల్యేలను మాజీలను చేసేవరకు నిద్రపోం..

Danam Nagender: ఖైరతాబాద్ మహా గణపతి కొత్త ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశాం..

Phone tapping Case: జూబ్లీహిల్స్‌ పోలీసుల కస్టడీకి రాధాకిషన్‌రావు

Updated Date - Jul 17 , 2024 | 05:56 PM