Congress: కాంగ్రెస్‌లోనే ఎమ్మెల్యే బండ్ల..
ABN , Publish Date - Aug 03 , 2024 | 04:51 AM
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మళ్లీ కాంగ్రెస్ చెంతకు చేరారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి.. తాను కాంగ్రె్‌సలోనే కొనసాగుతానని చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల న్యూటౌన్/హైదరాబాద్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మళ్లీ కాంగ్రెస్ చెంతకు చేరారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి.. తాను కాంగ్రె్‌సలోనే కొనసాగుతానని చెప్పారు. ఓవైపు శాసనసభ సమావేశాలు జరుగుతుండగా.. కృష్ణమోహన్‌రెడ్డి బుధవారం బీఆర్‌ఎ్‌సఎల్పీ కార్యాలయానికి వెళ్లడంతో ఆయన తిరిగి సొంత గూటికి చేరుకున్నారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
దీంతో మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం కృష్ణమోహన్‌రెడ్డి ఇంటికెళ్లి మాట్లాడటంతోపాటు ఆయనను తన వెంటే హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. శుక్రవారం మంత్రి జూపల్లి ఆధ్వర్యంలోనే కృష్ణమోహనరెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు.