Share News

Dharmapuri Aravind: రేవంత్‌.. నీ పౌరుషం చచ్చిపోయిందా?

ABN , Publish Date - Aug 03 , 2024 | 05:11 AM

‘‘రేవంత్‌.. నీ పౌరుషం చచ్చిపోయిందా?’’ అంటూ సీఎంను ఉద్దేశించి నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. ‘‘ఇదే ముఖ్యమంత్రిని కొడంగల్‌లో రాత్రి 2 గంటలకు నిద్రలేపి మరీ ఎత్తకపోయి జైలులో పెట్టిండు కేసీఆర్‌.

Dharmapuri Aravind: రేవంత్‌.. నీ పౌరుషం చచ్చిపోయిందా?

  • బీఆర్‌ఎస్‌ అవినీతిని వెలికితీస్తానన్నావు

  • మీరొచ్చి 9 నెలలైంది.. ఏం చేస్తున్నావ్‌?

  • కేటీఆర్‌ను మార్షల్స్‌150 స్పీడ్‌తో విసిరారు

  • మీడియా చిట్‌ చాట్‌లో ఎంపీ అరవింద్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ‘‘రేవంత్‌.. నీ పౌరుషం చచ్చిపోయిందా?’’ అంటూ సీఎంను ఉద్దేశించి నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. ‘‘ఇదే ముఖ్యమంత్రిని కొడంగల్‌లో రాత్రి 2 గంటలకు నిద్రలేపి మరీ ఎత్తకపోయి జైలులో పెట్టిండు కేసీఆర్‌. ఓటుకు నోటు కేసులో ఆరు నెలలు జైలుకు పంపిండు. ఫాంహౌస్‌ మీదకు ఏదో డ్రోన్‌ పంపిండని మళ్లీ అరెస్టు చేసిండు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే.. పదేళ్ల బీఆర్‌ఎస్‌ అవినీతిని వెలికితీస్తామని, తప్పు చేసినోళ్లను వదిలేదని లేదని రేవంత్‌ చెప్పారు. మరి.. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అవుతోంది. నీ పౌరుషం ఏమైంది.


చచ్చిపోయిందా?’’ అని ప్రశ్నించారు. కవితను అరెస్టు చేయనంత కాలం ఎందుకు అరెస్టు చేయలేదని రేవంత్‌ సహా కాంగ్రెస్‌ వాళ్లు గగ్గోలు పెట్టారని, అరెస్టు చేసిన తర్వాతేమో మాట మార్చేశారని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లుగా అసెంబ్లీ సమావేశాలను ఏదో మొక్కుబడిగా పెట్టారే తప్ప ప్రజా సమస్యలపై చర్చించే అవకాశమే ఇవ్వలేదన్నారు. కానీ ఇప్పుడు పదేళ్ల తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని, అది సంతోషమని వ్యాఖ్యానించారు.


ఇప్పుడు సభలో ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయన్నారు. కేటీఆర్‌ను మార్షల్స్‌ అసెంబ్లీ నుంచి బయటకు ఎత్తుకు రావడంపై అరవింద్‌ తనదైన శైలిలో స్పందించారు. ‘‘అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు వారి కళ్లకు కనపడలేదు. కానీ.. రోజులెప్పుడూ ఒకేలా ఉండవు కదా? నేను క్రికెటర్‌ని. ఒక బౌలర్‌ 150 స్పీడ్‌తో బాల్‌ విసిరితే ఎలా ఉంటదో తెలుసు కదా? అసెంబ్లీ మార్షల్స్‌ కూడా అదే స్పీడ్‌తో కేటీఆర్‌ను బయటకు విసిరేశారు.’’ అని అన్నారు. బీజేపీలో అధ్యక్ష పదవికి రేసులు ఉండవని.. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే సత్తా ఉన్న నేతకే ఆ పదవి దక్కుతుందని అరవింద్‌ తెలిపారు.

Updated Date - Aug 03 , 2024 | 05:12 AM