Share News

TG News: రంగారెడ్డిలో స్కూల్ బస్సు బీభత్సం

ABN , Publish Date - Aug 12 , 2024 | 09:43 AM

Telangana: శంషాబాద్ బెంగుళూరు హైవే పై ఓ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. సాతంరాయి వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న పాద చారిని వేగంగా దూసుకొస్తున్న బస్సు ఢీకొట్టింది. బస్సు బలంగా ఢీకొనడంతో గుర్తుతెలియని వ్యక్తి గాలీలోకి ఎగిరి బస్సుపై పడ్డాడు. తీవ్ర గాయాలతో పాదాచారి ఘటనా స్థలంలో ప్రాణాలు విడిచాడు.

TG News: రంగారెడ్డిలో స్కూల్ బస్సు బీభత్సం
Road Accident in Rangareddy

రంగారెడ్డి, ఆగస్టు 12: శంషాబాద్ బెంగుళూరు హైవే పై ఓ స్కూల్ బస్సు (School Bus) బీభత్సం సృష్టించింది. సాతంరాయి వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న పాద చారిని వేగంగా దూసుకొస్తున్న బస్సు ఢీకొట్టింది. బస్సు బలంగా ఢీకొనడంతో గుర్తుతెలియని వ్యక్తి గాలీలోకి ఎగిరి బస్సుపై పడ్డాడు. తీవ్ర గాయాలతో పాదాచారి ఘటనా స్థలంలో ప్రాణాలు విడిచాడు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ బస్సులో అక్కడి నుంచి పారిపోయి నేరుగా ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Vizag MLC Election: కూటమి అభ్యర్థిపై వీడనున్న ఉత్కంఠ!.. ఈ నెల 13తో ముగియనున్న నామినేషన్ల గడువు



బైక్ స్కిడై.. డివైడర్,స్తంభాన్ని ఢీకొని

అలాగే శంషాబాద్‌లో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. కొత్వాల్ గూడ ఔటర్ రింగు రోడ్డు సర్వీస్ రోడ్డు‌లో ఓ బైక్ అదుపుతప్పి స్కిడై డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తుల్లో ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాజేంద్రనగర్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు మీదుగా శంషాబాద్ వైపు వస్తున్న హోండా షైన్ వాహనం ప్రమాదానికి గురైంది. కొత్వాల్ గూడ చెన్నమ్మ హోటల్ వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని ఆపై స్తంభాన్ని ఢీకొట్టింది. తీవ్ర గాయాల‌పాలై స్పాట్‌లోనే ఒకరు ప్రాణాలు విడవగా.. మరో వ్యక్తిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

TS News: జ్వర స్వైర విహారం


స్ఫృహ లేనంతగా ఆల్కాహాల్ తీసుకుని మరీ...

కాగా.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మందుబాబులపై పోలీసులు కొరడా ఝుళిపించారు. శుక్ర, శనివారాల్లో విస్తృతంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. తాగి వాహనాల నడిపిన 212 మందిని అరెస్టు చేశారు. మద్యం సేవించి పట్టుపడ్డ వారిలో ద్విచక్ర వాహనదారులు 165 మంది 34కార్లు, ఇతర వాహనాలు ఉన్నాయి. మధ్యమధ్యలో ఆటోలు నడుపుతూ పదిమంది పట్టుబడ్డారు. 21 మంది స్పృహలేనంతగా మద్యం మత్తులో వాహనాలు నడిపినట్టు పోలీసులు గుర్తించారు. వీరిలో ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ 100 మిల్లీలీటల రక్త నమూనాలో 200 నుంచి 500 గ్రామాల ఆల్కాలు ఉన్నట్టు గుర్తించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదాలకు కారణమయ్యే వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చని పోలీసులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి..

Sachin's Aunt Anabel Mehta: కాబోయే అల్లుడు ఆరడుగులు ఉంటాడనుకున్నా!

Rain Update: హైదరాబాద్‌లో కుండపోత వర్షం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 12 , 2024 | 09:45 AM