Share News

Kankipadu: సీనియర్‌ పాత్రికేయుడు ఉపేంద్రబాబు మృతి..

ABN , Publish Date - Jul 06 , 2024 | 04:19 AM

సీనియర్‌ జర్నలిస్టు, ఆంధ్రజ్యోతి మాజీ డిప్యూటీ ఎడిటర్‌ గారపాటి ఉపేంద్రబాబు(88) శుక్రవారం మృతి చెందారు. ఉపేంద్రబాబు 1935లో కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని కాసరనేనివారిపాలెంలో జన్మించారు. 1

Kankipadu: సీనియర్‌ పాత్రికేయుడు ఉపేంద్రబాబు మృతి..

  • ఆంధ్రజ్యోతిలో డిప్యూటీ ఎడిటర్‌గా పదవీ విరమణ

కంకిపాడు, జూలై 5: సీనియర్‌ జర్నలిస్టు, ఆంధ్రజ్యోతి మాజీ డిప్యూటీ ఎడిటర్‌ గారపాటి ఉపేంద్రబాబు(88) శుక్రవారం మృతి చెందారు. ఉపేంద్రబాబు 1935లో కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని కాసరనేనివారిపాలెంలో జన్మించారు. 1961లో బీఏ ఆనర్స్‌ పూర్తి చేశారు. జర్నలిజం మీద మక్కువతో ఆంధ్రజ్యోతి ప్రారంభంలోనే సబ్‌ ఎడిటర్‌గా విధుల్లో చేరారు. సంస్థలో సుదీర్ఘకాలం సేవలు అందించి డిప్యూటీ ఎడిటర్‌ స్థాయికి చేరుకుని పదవీవిరమణ చేశారు.


ఆయనకు భార్య విద్య, కుమారుడు అజయ్‌, కుమార్తె అమల ఉన్నారు. పిల్లలు ఇద్దరు అమెరికాలో స్థిరపడ్డారు. కొంత కాలంగా గారపాటి అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కుమారుడు అజయ్‌ ఇండియా వచ్చి తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటున్నారు. ఉపేంద్రబాబు అంత్యక్రియలు శుక్రవారం విజయవాడలో జరిగాయి. ఉపేంద్రబాబు మృతికి ఆంధ్రజ్యోతి మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ, ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ సంతాపం ప్రకటించారు.

Updated Date - Jul 06 , 2024 | 04:19 AM