Share News

Sonia Gandhi: 2004లోనే తెలంగాణ ఇస్తానని చెప్పా..

ABN , Publish Date - Jun 03 , 2024 | 03:44 AM

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని 2004లోనే చెప్పానని గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సోనియా పాల్గొంటారనుకున్నప్పటికీ..

Sonia Gandhi: 2004లోనే తెలంగాణ ఇస్తానని చెప్పా..

  • కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలొచ్చాయి

  • అయినా లెక్కచేయక రాష్ట్రాన్నిచ్చా

  • రేవంత్‌ నేతృత్వంలో గ్యారెంటీల అమలు

  • వీడియో సందేశంలో సోనియా

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని 2004లోనే చెప్పానని గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సోనియా పాల్గొంటారనుకున్నప్పటికీ.. అనివార్య కారణాలతో ఆమె పర్యటన రద్దు కావడంతో ఢిల్లీ నుంచి వీడియో ద్వారా సందేశాన్నిచ్చారు. ‘‘తెలంగాణ అమరులు అందరికీ నివాళులు. తెలంగాణ ప్రజల చిరకాల కోరికైన ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేస్తామని 2004లోనే కరీంనగర్‌ వేదికగా హామీ ఇచ్చాను.


అప్పట్లో నా ప్రకటనపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఎంతోమంది కాంగ్రె్‌సను వీడి వెళ్లిపోయారు. అయినా పునరాలోచన చేయలేదు. తెలంగాణ ప్రజల సహనం, సంకల్పం నా కల సాకారానికి తోడుగా నిలిచాయి. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చాం. గడిచిన పదేళ్లలో తెలంగాణ ప్రజలు నాకు ఎంతో గౌరవం, ప్రేమను అందించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు అధికారాన్ని ఇచ్చారు. ప్రజల కలలన్నీ సాకారం చేయడాన్ని నా కర్తవ్యంగా భావిస్తున్నా. సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో గ్యాంరెటీలన్నీ అమలు చేస్తామని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నా. తెలంగాణ పదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు’’ అంటూ సోనియా గాంధీ వీడియో సందేశం ద్వారా పేర్కొన్నారు.

Updated Date - Jun 03 , 2024 | 03:44 AM