Share News

CPI Narayana: సీఎం రేవంత్‌కు సీపీఐ నారాయణ లేఖ.. ఎందుకంటే..?

ABN , Publish Date - Jul 09 , 2024 | 05:37 PM

సీఎం రేవంత్ రెడ్డి‌కి (CM Revanth Reddy) సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) లేఖ రాశారు. అమెరికా అట్లాంటాలో వరంగల్‌కి చెందిన వెన్నెల అనే అమ్మాయి రోడ్డు ఆక్సిడెంట్‌లో తీవ్రగాయాలై హాస్పటల్ ఉందని తెలిపారు.

CPI Narayana: సీఎం రేవంత్‌కు సీపీఐ నారాయణ లేఖ.. ఎందుకంటే..?
CPI Narayana

ఢిల్లీ: సీఎం రేవంత్ రెడ్డి‌కి (CM Revanth Reddy) సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) లేఖ రాశారు. అమెరికా అట్లాంటాలో వరంగల్‌కి చెందిన వెన్నెల అనే అమ్మాయి రోడ్డు ఆక్సిడెంట్‌లో తీవ్రగాయాలై హాస్పిటల్లో ఉందని తెలిపారు. పేద కుటుంబానికి చెందిన వెన్నెలకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేఖలో విన్నవించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది చదువులకోసం విదేశాలకు వెళ్తున్నారని వివరించారు. విదేశాల్లో చదువు కుంటున్న విద్యార్థుల కోసం ఒక స్పెషల్ సెల్ ఏర్పాటు చేయాలని నారాయణ కోరారు.

Updated Date - Jul 09 , 2024 | 06:25 PM